Big TV Kissik Talks: “బిగ్ టీవీ” (Big Tv)లో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న “బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్”(Big tv Kissik Talks) ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా జబర్దస్త్ వర్ష (Varsha) వ్యవహరించగా ప్రతివారం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతోపాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇక ఈవారం ఈ కార్యక్రమానికి బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రేరణ(Prerana) హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమవుతుంది.
అవకాశాలు లేవు…
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేరణ ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ప్రేరణ బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8)కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత తనకు అవకాశాలు లేకుండా పోయాయి అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. బిగ్ బాస్ కార్యక్రమానికి ముందు నాకు సీరియల్స్ ఉండేవి నాకు ప్రతిరోజు పేమెంట్ వచ్చినట్టే ఉండేది కానీ ఇప్పుడు అలా కాదని త్వరగా స్టార్ మా నాకు సీరియల్స్ లో అవకాశాలు ఇవ్వండి అంటూ ఈ సందర్భంగా సరదాగా చెప్పుకు వచ్చారు.
పెళ్లయిన వెంటనే బిగ్ బాస్ ఛాన్స్…
ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమానికి అవకాశం వచ్చిన సమయంలో తన భర్త శ్రీపాద్(Sri Phad) తో పెద్ద గొడవ జరిగిందని దాదాపు ఒక వారం రోజులపాటు మాట్లాడుకోలేదని ఈమె తెలియజేశారు.. నాకు పెళ్లయిన కొద్ది నెలలకే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అయితే పెళ్లయిన తర్వాత వచ్చే ప్రతి పండుగ కూడా ఎంతో స్పెషల్ ఉంటుంది. అలాగే మా యానివర్సరీ కూడా నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడే వచ్చింది ఇలా ఇవన్నీ మిస్ అవుతామని నాకు శ్రీపాద్ కు మధ్య గొడవ జరిగిందని తాను బిగ్ బాస్ వెళ్లడం తనకు ఇష్టం లేదని తెలియజేశారు.
ఇలా తన భర్త తనతో మాట్లాడకపోవడంతో చాలా అప్సెట్ అయిపోయానని ఒక రోజు రాత్రి తనతో మాట్లాడుతూ.. నేను హౌస్ లోకి వెళ్లిన తర్వాత మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కానీ నాకు బయట నుంచి సపోర్ట్ లేకపోతే నేను అక్కడ ఉండలేను అంటూ తనకు చెప్పాను.శ్రీపాద్ ఈ విషయం గురించి ఏం ఆలోచించారో తెలియదు కానీ మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే నాతో మామూలుగా మాట్లాడటమే కాకుండా నేను బిగ్ బాస్ వెళ్లడానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక బయట నుంచి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ నేను బిగ్ బాస్ లో చివరి వరకు ఉండటానికి కారణమయ్యారు అంటూ ఈ సందర్భంగా తన భర్త గురించి తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ప్రేరణ పెద్దగా సీరియల్స్ చేయలేదు కానీ స్టార్ మా లో ప్రసారమవుతున్న బుల్లితెర కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇస్మార్ట్ జోడి కార్యక్రమానికి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ జంట విన్నర్ గా నిలిచారు. ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సినిమాలలో అవకాశాలు వచ్చినా నటించడానికి తాను సిద్ధమేనని ఈ సందర్భంగా ప్రేరణ తెలియజేశారు.
Also Read: Nagavamshi: పాప్ కార్న్ ధర చూసి భయపడ్డాను.. కట్టడి చేయాల్సిందే!