BigTV English

Shubman Gill: అమ్మాయిలతో గిల్ సెల్పీలు… కుళ్లుకుంటున్న సారా ?

Shubman Gill: అమ్మాయిలతో గిల్ సెల్పీలు… కుళ్లుకుంటున్న సారా ?

Shubman Gill: భారత్ – ఇంగ్లాండ్ మధ్య గురువారం నుండి 3 వన్డేల సిరీస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగపూర్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక ఈ నెల 9 ఆదివారం రోజున ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ వేదికగా జరగనున్న రెండవ వన్డేలో విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు.


Also Read: Team India: పూరి జగన్నాథ్ ఆలయంలో టీమిండియా ప్లేయర్ల పూజలు..ఆటోలో వెళ్లి మరీ !

ఈ రెండవ వన్డే ఆదివారం రోజు కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. చాలాకాలం తర్వాత కటక్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వబోతుండడంతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. మంగళవారం రాత్రి నుండే స్టేడియం బయట అభిమానులు భారీగా గుమిగూడి.. బుధవారం రాత్రి ఆఫ్ లైన్ టికెట్ కౌంటర్లు తెరిచిన వెంటనే టికెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట ఏర్పడింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేసేందుకు కటక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగన్ మోహన్ మీనా నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు.


మరోవైపు ఈరోజు ఉదయమే భారత జట్టు ఆటగాళ్లు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ చేరుకున్నారు. రెండవ వన్డే కోసం కటక్ లోని ఎయిర్పోర్ట్ కి చేరుకున్న భారత జట్టు యువ ఆటగాడు గిల్.. ఎయిర్ పోర్ట్ లో.. హెయిర్ హోస్టర్లతో ఫోటోలు దిగారు. సెల్ఫీ ప్లీజ్ అని.. ఎయిర్ హోస్టర్లు అడగగా.. దీనికి వెంటనే ఓకే అని చెప్పేశారు గిల్. దీంతో హెయిర్ హోస్టర్లతో గిల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి చూసిన నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. గిల్ ఫాలోయింగ్ మామూలుగా లేదని, ఎయిర్ హోస్టర్లతో గిల్ ఫోటోలు చూసిన సారా టెండూల్కర్ కుళ్ళుకుంటుండోచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. ఇక భారత జట్టు ఆటగాళ్లంతా ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా వారు బస చేస్తున్న హోటల్ కి వెళ్లిపోగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తి భావంలో మునిగిపోయారు. ఈ ముగ్గురు స్పిన్నర్లు దైవదర్శనానికి ముందు శ్రీ మందిర్ కి ఆటోలో ప్రయాణించారు.

Also Read: Champions Trophy 2025: పాకిస్థాన్‌ కొత్త జెర్సీపై ట్రోలింగ్‌..మున్సిపాలిటీ డ్రెస్‌ లా ఉందటూ ?

పూరి పోలీసు అధికారులు వీళ్లకు భద్రత కల్పించగా.. ఆటోలో ప్రయాణించి ఆలయం చేరుకున్నారు. ఇక దర్శనానంతరం పూరి ఆలయ అధికారులు ఈ ముగ్గురు స్పిన్నర్లకు పవిత్ర వస్త్రంతో ఆశీర్వదించారు. ఇక ఆలయంలో అర్చన అనంతరం వీరు కటక్ వెళ్లిపోయారు. కాగా భారత జట్టు ఇప్పటికే కటక్ లో ప్రాక్టీస్ స్టేషన్ ని ప్రారంభించింది. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు రెండవ వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ లో కూడా టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మొదటి మ్యాచ్ కి గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ.. తిరిగి జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×