Rashid Khan Run-out: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా.. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) వర్సెస్ దక్షిణాఫ్రికా ( South Africa ) మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా… 315 పరుగులు చేసి దుమ్ము లేపింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఎంత కట్టడి చేయాలనుకున్న… దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. అయితే ఈ భారీ స్కోర్ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
Also Read: Glenn Phillips: ఎవర్రా వీడు… రోజుకు 800 push-ups చేస్తున్నాడా..?
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ( Rashid Khan rUN oUT )… అదిరిపోయే రనౌట్ చేశాడు. సెంచరీ తో దుమ్ము లేపుతున్న దక్షిణాఫ్రికా ఆటగాడిని… తన అద్భుతమైన ఫీల్డింగ్ తో బోల్తా కొట్టించాడు. ఇవాల్టి మ్యాచ్లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కం ఓపెనర్ రికెల్టన్ 106 బంతుల్లోనే 103 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో ఒక సిక్సర్ ఉండగా ఏడు బౌండరీలు ఉన్నాయి. అయితే అలాంటి ఆటగాన్ని… రషీద్ ఖాన్ రనౌట్ చేయడం జరిగింది.
రషీద్ ఖాన్ ( Rashid Khan ) బౌలింగ్ లో… స్ట్రెయిట్ డ్రైవ్ చేసేందుకు రికెల్టన్ ( Rickelton ) ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గ్రీజు వదిలి ముందుకు వచ్చి ఆడాడు దక్షిణాఫ్రికా ఆటగాడు. అయితే ఆ బంతి నేరుగా రషీద్ ఖాన్ చేతిలో పడగా… వికెట్ కీపర్ వైపు.. వేగంగా విసిరాడు. దీంతో… అక్కడే ఉన్న వికెట్ కీపర్… వెంటనే వికెట్లను గిరాటేశాడు. అయితే… రికెల్టన్… బ్యాటు క్రీజ్ లో పెట్టినప్పటికీ… బ్యాట్ మాత్రం పైకి లేచింది. దీంతో… అతడు రన్ అవుట్ గా వెనుతిరిగాల్సి వచ్చింది.
ఇది ఇలా ఉండగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 315 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో రికెల్టన్ 103 పరుగులు చేయగా… టోనీ 11 పరుగులు చేశాడు. అలాగే దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బౌమా 58 పరుగులతో దుమ్ము లేపాడు. ఆ తర్వాత వచ్చిన వండర్ దుస్సేన్ 52 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అలాగే హైదరాబాద్ మాజీ కెప్టెన్ మర్కరం 53 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఆరు బౌండరీలు అలాగే ఒక సిక్సర్ కూడా బాధడం జరిగింది.
అదే సమయంలో ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో నబి ఒక్కడే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన నభి… 51 పరుగులు ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ 10 ఓవర్లు వేసి 59 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇలా వికెట్ తీయకుండా రషీద్ ఖాన్… బౌలింగ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అతని ప్రతి మ్యాచ్లో కచ్చితంగా వికెట్ పడుతుంది. కానీ ఈసారి వికెట్ మాత్రం పడలేదు. అలాగే నూర్ అహ్మద్ ఒక వికెట్ తీయగా… ఫారూకి ఒక వికెట్ అలాగే అజ్మతుల్లా మరొక వికెట్ తీశాడు. ఇక 315 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ పోరాడుతోంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయింది ఆఫ్గానిస్తాన్.
Also Read: Shikhar Dhawan: కొత్త పిల్లతో ధవన్ ఎంజాయ్… పక్కనే కూర్చోని ఆ పనులు ?
Rashid Khan that was humiliating #AFGvsSA #ChampionsTrophy2025 pic.twitter.com/uurHQOp3KU
— Saad (@Saad_dogar77) February 21, 2025