BigTV English

Rashid Khan : ఫిట్ నెస్ లేక.. సిరీస్ నుంచి రషీద్ అవుట్

Rashid Khan : ఫిట్ నెస్ లేక.. సిరీస్ నుంచి రషీద్ అవుట్
Rashid Khan

Rashid Khan : ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ని భారత్ సిరీస్ నుంచి క్రికెట్ బోర్డు తొలగించింది. వెన్నుపూసకి ఆపరేషన్ చేయించుకున్న రషీద్ ఖాన్ కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ పర్యటనకు వస్తున్న టీమ్ కి కొత్త కెప్టెన్ గా ఇబ్రహీం జద్రాన్ ని ఎంపిక చేసింది. అలాగే రషీద్ ఖాన్ ని కూడా ఎంపిక చేసింది.


కానీ తాజాగా రషీద్ ఖాన్ పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో మొత్తం సిరీస్ నుంచే తప్పించారు. తను లేకపోయినా సరే, ఆఫ్గాన్ టీమ్ లో స్పెషలిస్ట్ స్పిన్నర్లు నూర్ అహ్మద్,  ఫజల్ హక్, నవీనుల్ హక్ ఉన్నారు. వీరితో జట్టు బలంగానే కనిపిస్తోంది. అందుకని ఆఫ్గాన్ విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని టీమ్ ఇండియాకు సీనియర్లు సూచిస్తున్నారు.

ఆఫ్గాన్ ప్లేయర్లు ఎప్పుడెలా ఆడతారో ఎవరికీ తెలీదని చెబుతున్నారు. మహామహా జట్లనే వారు మట్టి కరిపించారని గుర్తు చేస్తున్నారు. తమదన్నరోజున ఆఫ్గనిస్తాన్ ని ఆపడం ఎవరి తరం కాదని, అందుకని కొంచెం జాగర్తగానే ఉండాలని సూచిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్గాన్ జట్టు సంచలనాలు నమోదు చేసిన సంగతి మరువకూడదని అంటున్నారు.


జట్టులోంచి తప్పించిన రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ ని మలుపు తిప్పగల సమర్థుడు. అంతే కాదు మ్యాచ్ విన్నర్ కూడా అని చెప్పాలి. ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయినప్పుడు రషీద్ ఖాన్ వచ్చి ఆ జోడిని విడదీస్తాడు. అంత టాలెంటడ్ అని అంతా చెబుతుంటారు.

25 ఏళ్ల రషీద్ ఖాన్ 2015లో జాతీయ జట్టులోకి వచ్చాడు. 103 వన్డేలు ఆడి 183 వికెట్లు తీసుకున్నాడు. 3748 పరుగులు కూడా చేసి మంచి ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. 5 టెస్ట్ లు మాత్రమే ఆడాడు. 34 వికెట్లు తీసుకున్నాడు.ఇండియాలోని ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇంతకు ముందు వరకు ఆఫ్గాన్ జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. ఫిట్ నెస్ లేక ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఈ పర్యటన తర్వాత మరి ఐపీఎల్ లో ఆడతాడో లేదో తెలీదు. కానీ వచ్చే టీ 20 వరల్డ్ కప్ సమయానికి మాత్రం మళ్లీ ఎప్పటిలా యథాతథంగా జట్టులో రషీద్ ఖాన్ ఉంటాడని అంటున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×