E-Paper
Advertisement

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబ‌ర్ ను హీరో చేయకండి…తేడా వ‌స్తే 32 ప‌ళ్లు రాళ్లు రాల‌తాయి

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబ‌ర్ ను హీరో చేయకండి…తేడా వ‌స్తే 32 ప‌ళ్లు రాళ్లు రాల‌తాయి
Advertisement

Ahmad Shahzad On Babar Azam:  పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ గా బాబర్ ఆజం (Babar Azam) బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ జట్టు పరిస్థితులు పూర్తిగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొన్న వెస్టిండీస్ పై రెండో మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ విక్టరీ సాధించింది. దీంతో టెస్ట్ సిరీస్ కోల్పోకుండా బాబర్ ఆజం సమం చేశాడు. ఈ సిరీస్ సమం అయిన నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. లైవ్ డిబేట్లు నడిపించి బాబర్ ఆజంను మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బాబ‌ర్ ఆజంను అంత‌లా లేప‌కండి – అహ్మద్ షెజాద్

ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెజాద్ (Ahmad Shahzad) మాత్రం బాబర్ ఆజం పరువు తీశాడు. అతిగా బాబర్ ఆజంను లేపకండి…ఒక్కసారిగా పాకిస్తాన్ కుప్పకూలితే, మరోసారి తిట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రెండో టెస్ట్ సందర్భంగా సెకండ్ ఇన్నింగ్స్ లో బాబర్ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడని గుర్తు చేశారు. కెప్టెన్ గా ఏం చేయాలో అతనికి అర్థం కాని పరిస్థితి ఎదురైందని బాంబు పేల్చారు. కెప్టెన్ గా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబ‌ర్ ను హీరో చేయకండి…తేడా వ‌స్తే 32 ప‌ళ్లు రాళ్లు రాల‌తాయని హెచ్చ‌రించారు.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

టీమిండియాను ఓడిస్తేనే బాబ‌ర్ హీరో అవుతాడు

వెస్టిండీస్ పై రెండో టెస్టులో విజయం సాధించిన బాబర్ ఆజం సేన.. అదే సమయంలో టీమిండియాను ఓడించాల్సిన అవసరం ఉందని అహ్మద్ షెజాద్ (Ahmad Shahzad) అన్నారు. అప్పుడే బాబర్ ఆజం రియల్ హీరో అవుతాడని తెలిపారు. అప్పటివరకు నిద్రపోకూడదని కోరారు. ఇదే ఊపును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఇప్పుడే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇవ్వకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరారు. ఆవేశపడి కెప్టెన్సీ ఇస్తే పాకిస్తాన్ కొంపమడుగుతుందని హెచ్చరించారు. కెప్టెన్ గా అతడు ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దీంతో అహ్మద్ షెజాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అహ్మద్ షెజాద్ కు కౌంటర్ ఇచ్చిన రషీద్ లతీఫ్

Advertisement

బాబర్ ఆజం కెప్టెన్సీ పై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్ అహ్మద్ షెజాద్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రషీద్ లతీఫ్. బాబర్ ఆజం అద్భుతంగా రాణించాడని గుర్తు చేశారు. కావాలంటే భూతద్దాలు పెట్టుకొని చూడాలని హితువు పలికారు. విండీస్ పై పాక్ గెల‌వ‌డానికి కార‌ణం బాబ‌ర్ ఒక్క‌డే అన్నారు. భ‌విష్య‌త్తులో కూడా పాకిస్తాన్ ను ప్ర‌తీ మ్యాచ్ లోనూ గెలిపిస్తాడ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

Related News

గిల్, కోహ్లీ సెంచ‌రీలు..15 వేల పరుగుల క్లబ్ లో విరాట్…విండీస్ పై టీమిండియా విజయం

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

Big Stories

Advertisement
×