E-Paper
Advertisement

Ravichandran Ashwin: రోహిత్‌-కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డేలు ఆపేయాల్సిందే..అశ్విన్ సంచ‌ల‌నం

Ravichandran Ashwin: రోహిత్‌-కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డేలు ఆపేయాల్సిందే..అశ్విన్ సంచ‌ల‌నం
Advertisement

Ravichandran Ashwin:  టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin )  సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మతో ( Rohit Sharma) పాటు విరాట్ కోహ్లీ ( Virat Kohli) రిటైర్మెంట్ ఇస్తే వన్డే క్రికెట్ ప్రమాదంలో పడే ఛాన్సులు ఉన్నట్లు బాంబు పేల్చారు అశ్విన్. ఈ మేరకు ఓ పాడ్ కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో అశ్విని చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందుకే సాధ్యమైనంతవరకు వన్డేలలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఆడించాలని వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని అశ్విన్ కోరారు. అప్పుడే వన్ డే క్రికెట్ బతుకుతుందని స్పష్టం చేశారు.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

రోకో లేకపోతే వన్డేలు కష్టమే.. అశ్విన్ సంచలనం

Advertisement

టి20 లతోపాటు టెస్టులకు రోహిత్ శర్మ ( Rohit Sharma) , విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం వన్డేల్లో మాత్రమే ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్కు ప్రేక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. వీళ్ళు ఆడని t20 లు, టెస్ట్ క్రికెట్ ఎవరు చూడడం లేదు. మీడియాలకు వచ్చే అభిమానుల సంఖ్య అమాంతం తగ్గిపోయింది.

అయితే ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేల్లో ఆడడం ఎంత ముఖ్యమో సవివరంగా టీమిడియా మాజీ క్రికెటర్ అశ్విన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వన్డే క్రికెట్ పరిస్థితి పై ఆయన స్పందించారు. 2027 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టమేనని ఆయన తెలపడం జరిగింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ లాంటి దిగజాలు రిటైర్మెంట్ ప్రకటిస్తే వన్డే క్రికెట్ చూసేవారు తగ్గిపోతారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. టి20 క్రికెట్ కు హవా పెరగడం అలాగే టెస్టులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వన్డేలకు ఆదరణ తగ్గిపోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కాలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలు ఆడేలా చూడాలని సూచనలు చేశారు అశ్విన్.

Advertisement

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత రోకో రిటైర్మెంట్‌

2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన వెంటనే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు క్రికెటర్ల ఏజ్ దాదాపు 40 సంవత్సరాల వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కుర్ర క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే 2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్ గా ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఆడుతున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×