Ravichandran Ashwin Net Worth: భారత క్రికెట్ జట్టు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న బీజీటీ సిరీస్ మధ్యలో అశ్విన్ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి షాక్ కి గురి చేశాడు. ఆల్ రౌండర్ అశ్విన్ పేరిట భారీ రికార్డులు ఉన్నాయి. విభిన్నమైన శైలిలో బౌలింగ్ చేస్తూ.. అప్పుడప్పుడు బ్యాట్ తోను మెరుస్తూ ఉండేవాడు ఈ వెటరన్ ప్లేయర్. ఇక భారత్ – ఆసీస్ మూడవ టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు.
అశ్విన్ టెస్టుల్లో 500లకు పైగా వికెట్లు పడగొట్టాడు. 2010 జూన్ 5వ తేదీన భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన అశ్విన్.. అప్పటినుండి ఎన్నో గొప్ప గొప్ప మ్యాచ్ లు ఆడాడు. 14 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు జట్టుకు ఎన్నో సేవలు అందించాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించి అశ్విన్ ఇప్పుడు వైరల్ గా మారాడు. క్రీడ మైదానంలో ఎంతో పేరు సంపాదించుకున్న అశ్విన్.. సంపాదనలో {Ravichandran Ashwin Net Worth} కూడా వెనకడుగు వేయలేదు.
తమిళనాడులోని చెన్నైలో జన్మించిన రవిచంద్రన్ అశ్విన్.. 2024 నాటికి 16 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 132 కోట్ల ఆస్తిని {Ravichandran Ashwin Net Worth} కలిగి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. క్రికెట్ లో మాత్రమే కాకుండా యాడ్స్ ద్వారా కూడా అశ్విన్ చాలా సంపాదిస్తున్నాడు. బీసీసీఐ తరఫున గ్రేడ్ – ఏ కాంట్రాక్ట్ పొందిన అశ్విన్ ప్రతి ఏటా బిసిసిఐ నుంచి రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతూ మరో ఐదు కోట్లు పొందాడు. ఇప్పుడు తన సొంతగడ్డ టీమ్ లో చేరిన అశ్విన్ కి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక్కో ఏడాది రూ 9.75 కోట్లు చెల్లించనుంది {Ravichandran Ashwin Net Worth}.
Also Read: Ashwin – Indian Players: అశ్విన్ రిటైర్మెంట్… సేఫ్ గా బయటపడ్డ ముగ్గురు ప్లేయర్లు ?
అశ్విన్ కి చెన్నైలో ఓ విలాసవంతమైన ఇంటితోపాటు ఆరు కోట్ల విలువ చేసే రోల్స్ రైస్ కార్ తో పాటు రూ. 93 లక్షల ఆడి క్యూ 7 ఉన్నాయి. అశ్విన్ మ్యాచ్ ఫీజ్ తో పాటు ఐపీఎల్ ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తారు {Ravichandran Ashwin Net Worth}. జూమ్ కార్, మూవ్ వంటి వాటిని ప్రమోట్ చేస్తుంటాడు. ఇవే కాకుండా స్పేస్ మేకర్స్, బాంబే షేవింగ్ కంపెనీ, అరిస్ట్రోక్రాట్ బ్యాగ్స్, కోకో స్టూడియో తమిళ్, మన్నా ఫుడ్స్, మైంత్రా, ఒప్పో, డ్రీమ్ 11 ప్రకటనల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. ఏది ఏమైనాప్పటికీ ఓ క్రికెటర్ ఏదో ఒక రోజు తన ఆటకు వీడ్కోలు పలకాల్సిందే. ఇక భారత జట్టుకు ఎన్నో సేవలందించిన అశ్విన్ బుధవారం తన ఆటకి వీడ్కోలు పలికాడు.