Ashwin – Indian Players: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బెన్ లోని గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్ట్ చివరి రోజు మ్యాచ్ డ్రా గా ముగిసిన తర్వాత టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ మూడవ టెస్ట్ లో అశ్విన్ కి టీమ్ లో చోటు దక్కలేదు. ఇక ఈ టెస్ట్ ముగిసిన తర్వాత తన రిటైర్మెంట్ ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ ప్రకటించాడు. తన 14 ఏళ్ల కెరీర్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలుపుతూ అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు.
Also Read: Watch Video: ఔటా.. నాటౌటా…బిత్తరపోయిన ప్లేయర్లు.. వీడియో వైరల్
పెర్త్ టెస్ట్ లో గెలిచినప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని అశ్విన్ అనుకున్నాడట. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనని పింక్ బాల్ టెస్ట్ ఆడేలా ఒప్పించినట్లు తెలిపాడు అశ్విన్. ఇక అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకడంతో అతని రిటైర్మెంట్ ని ప్రకటిస్తూ బీసీసీఐ కూడా ప్రత్యేక అభినందనలు తెలిపింది. అశ్విన్ భారత జట్టులో ఓ అమూల్యమైన ఆల్రౌండర్ గా పేర్కొంది. 2010లో భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన అశ్విన్.. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ తో తన కెరీర్ ని ప్రారంభించాడు.
ఇక 2011లో వెస్టిండీస్ పై తొలి టెస్ట్ ఆడాడు. తన కెరీర్ లో 106 టెస్టులు ఆడిన అశ్విన్ 3503 పరుగులు చేశాడు. టెస్ట్ ఫార్మాట్ లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అలాగే 106 టెస్టుల్లో 24.00 యావరేజ్ తో 537 వికెట్లు తీశాడు. ఇక 116 వన్డేల్లో 707 పరుగులు చేశాడు. వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టారు. 65 టి-20 లు ఆడిన అశ్విన్.. 72 వికెట్లు పడగొట్టాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ జట్టుకి తన సేవలను అందించాడు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కి రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలకడంతో టీమ్ లోని ఇతర సీనియర్ల {Ashwin – Indian Players} గురించి చర్చలు మొదలయ్యాయి.
ఇప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ తో ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ {Ashwin – Indian Players} తప్పించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు ఎవరో కాదు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వీరు కోచ్ గంభీర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, బీసీసీఐ పెద్దల సహకారంతో సేఫ్ అయ్యి.. అశ్విన్ ని బలి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అశ్విన్ ఫెయిల్ అయింది కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ గత 13 టెస్ట్ ఇన్నింగ్స్ లలో ఒక్క అర్థ సెంచరీ మాత్రమే చేశాడు.
Also Read: Sanju Samson: శాంసన్‌కు మరో షాక్… మళ్లీ తొక్కేస్తున్నారు కదరా ?
13 ఇన్నింగ్స్ లలో 8సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. ఒక్క ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ తప్పితే మిగతా నాలుగు ఇన్నింగ్స్ లలో 25 స్కోర్ కూడా నమోదు చేయలేదు. అటు విరాట్ కోహ్లీ నుంచి కూడా పెద్ద ఇన్నింగ్స్ లు రావడం లేదు. ఇక సీనియర్ ఆల్రౌండర్ జడేజా కూడా ఇంతకుముందులా ఆడడం లేదు. వీళ్లు ఆరు నెలలకు ఒకసారి హాఫ్ సెంచరీ చేస్తే గొప్పే అనేలా ఉంది పరిస్థితి. వీళ్ళ ముగ్గురికి కూడా సమయం ముగిసిపోయిందని, వీళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఇకనైనా తమ ఆట తీరును మార్చుకొని రాణిస్తారా..? లేక రిటైర్మెంట్ దిశగా పయనిస్తారా..? అన్నది వేచి చూడాలి.