BigTV English

Ravindra Jadeja Triple Record: రవీంద్ర జడేజా త్రిబుల్ రికార్డ్.. ఐపీఎల్ లోనే హిస్టరీ!

Ravindra Jadeja Triple Record: రవీంద్ర జడేజా త్రిబుల్ రికార్డ్.. ఐపీఎల్ లోనే హిస్టరీ!
Ravindra Jadeja
Ravindra Jadeja

Ravindra Jadeja Becomes First Player to Hit ‘THIS’ Triple Milestones In IPL History: ఐపీఎల్ లో రవీంద్ర జడేజా పేరు మార్మోగిపోతోంది. అంటే ఏదో సీఎస్కే మ్యాచ్ ఒక్కటి గెలిపించినందుకు కాదు. ఆ ఒక్క మ్యాచ్ ద్వారా ఎన్నో రికార్డులను తిరగరాశాడు. తన పేరున లిఖించుకున్నాడు. అలాగే ఐపీఎల్ లో ఇంతవరకు ఎవరూ సాధించని ఫీట్ సాధించాడు. అలా తొలి క్రికెటర్ అయ్యాడు.


వివరాల్లోకి వెళితే… ఐపీఎల్ లో 100 క్యాచ్‌లు,100 వికెట్లు, 1000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. తను ఆల్ రౌండర్ కావడంతో అన్ని విభాగాల్లో తను ముందుంటాడు. అంతేకాదు ఫీల్డింగ్ లో ప్రపంచంలోనే టాప్ 10 లో తను ఏడో స్థానంలో ఉన్నాడు. అంటే ఇంతకు ముందే 1000 పరుగులు పూర్తి చేశాడు. 100 వికెట్లు ఎప్పుడో తీశాడు. కానీ 100 వ క్యాచ్ మాత్రం…కోల్ కతా మ్యాచ్ లోనే
శ్రేయాస్ అయ్యర్ ది పట్టాడు. దాంతో త్రిబుల్ రికార్డ్ కొట్టాడు. అది సాధించిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు.

జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ముగ్గురు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. సునీల్ నారాయణ్, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్‌లను జడేజా పెవిలియన్‌కు పంపించాడు.


Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సన్ రైజర్స్ జట్టు

ఇకపోతే 100 క్యాచ్‌ లు పట్టిన 5వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన నాల్గవ భారతీయుడు కాగా, ప్రపంచంలో ఐదో ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మలు ఈ ఘనతను సాధించారు.

2008 లో ప్రారంభమైన ఐపీఎల్‌ మొదటి సీజన్‌ నుంచి తను ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 231 మ్యాచ్‌ల్లో బ్యాటర్ గా 2,776 పరుగులు చేశాడు. బౌలర్‌గా 156 వికెట్లు తీశాడు. IPL చరిత్రలో 2000 కంటే ఎక్కువ పరుగులు, 150 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి ఆటగాడు కూడా జడేజాయే కావడం విశేషం.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×