OTT Movie : సాధారణంగానే ఓటీటీలో వచ్చే సినిమాలను మనం చూడకుండా వదలము. అలాంటిది నాని లాంటి సెలబ్రిటీ ఫేవరెట్ సినిమా అంటే ఊరుకుంటామా? ఈరోజు మన మూవీ సజెషన్ నానికి ఇష్టమైన మలయాళ సినిమాలలో ఒకటి. మరి ఈ క్రేజీ మలయాళ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో ఉందంటే?
కథ
కేరళలోని కుంబలంగి గ్రామంలో జరుగుతుంది ఈ కథ. ఒక ఇంట్లో నలుగురు సోదరులు సాజి (సౌబిన్ షాహిర్), బాబీ (షేన్ నిగం), బోనీ (శ్రీనాథ్ భాసి), ఫ్రాంకీ (మాథ్యూ థామస్) ఉంటారు. వీళ్ళ తల్లి సన్యాసినిగా మారి వెళ్లిపోతుంది. తండ్రి చనిపోతాడు. దీంతో వీళ్ళకు ఒకరితో ఒకరికి అస్సలు పడదు. సాజి, బాబీ ఉద్యోగం లేకుండా, బాధ్యతారాహిత్యంగా ఉంటారు. బోనీకి సంగీతం, డ్యాన్స్ అంటే ఇష్టం. ఫ్రాంకీ మాత్రం స్కూల్‌లో చదువుకుంటూ ఇంటిని నడపడానికి ప్రయత్నిస్తాడు.
బాబీ స్థానిక టూరిస్ట్ గైడ్ బేబీ (అన్నా బెన్)ని ప్రేమిస్తాడు. బేబీ కుటుంబం అక్కడే ఒక హోమ్‌స్టే నడుపుతుంది. ఆమె సోదరి సిమీ (గ్రేస్ ఆంటోనీ), బావ షమ్మీ (ఫహద్ ఫాసిల్), తల్లితో కలిసి నివసిస్తుంది బేబీ. షమ్మీ తనను తాను “కంప్లీట్ మ్యాన్”గా భావిస్తాడు. తన భార్య ఇంట్లో పెత్తనం అంతా అతనిదే. బాబీ – బేబీ ప్రేమ వ్యవహారం బయట పడడంతో, ఆ నలుగురు అన్నదమ్ములు పనికిమాలిన వాళ్ళు అంటూ ఈ పెళ్ళికి అడ్డు చెబుతాడు షమ్మీ.
దీంతో సాజి కుంగిపోతాడు. ఆత్మహత్యాయత్నం కూడా చేస్తాడు. ఆ తర్వాత బేబీ బాబీతో పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ షమ్మీ ఆమె ప్లాన్ ను ముందే తెలుసుకుని బేబీ, సిమీ, ఆమె తల్లిని ఇంట్లోనే బంధిస్తాడు. అక్కడి నుంచి వీళ్ళు ముగ్గురూ ఎలా బయట పడ్డారు ? సోదరుడి ప్రేమను గెలిపించడానికి ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏం చేశారు? చివరికి బాబీ-బేబీ ఒక్కటయ్యారా? లేదా? క్లైమాక్స్ ఏంటి? అన్నది ఈ ఈ ఫీల్ గుడ్ ఫన్ స్టోరీ.
Read Also : ఒకరోజు ముందే రెండు ఓటీటీల్లోకి వచ్చిన మోస్ట్ అవైటింగ్ మలయాళ కామెడీ డ్రామా… ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?
ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ‘కుంబలంగి నైట్స్’ (Kumbalangi Nights). తన ఫేవరెట్ మలయాళ సినిమాల లిస్ట్ లో ఈ మూవీ కూడా ఉందని రీసెంట్ గా నాని ‘హిట్ 3’ ప్రమోషన్లలో వెల్లడించారు. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ నారాయణన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ కామెడీ-డ్రామా. ఇందులో ఫహద్ ఫాసిల్, సౌబిన్ షాహిర్, షేన్ నిగం, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళలోని కొచ్చిలోని కుంబలంగి అనే చేపలు పట్టే గ్రామంలో ఈ కథ నడుస్తుంది. కానీ ఈ మూవీ మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. భాషతో ఇబ్బంది లేదనుకునే వారు, ఇంకా చూడని వారు వెంటనే ఈ మూవీపై ఓ లుక్కేయండి.