E-Paper
Advertisement

IPL 2026 Playoffs: సేఫ్ జోన్ లో SRH..ప్లే ఆఫ్స్‌లోకి RCB..మిగిలిన ఈ మూడు జ‌ట్ల‌కు ఛాన్స్

IPL 2026 Playoffs:  సేఫ్ జోన్ లో SRH..ప్లే ఆఫ్స్‌లోకి RCB..మిగిలిన ఈ మూడు జ‌ట్ల‌కు ఛాన్స్
Advertisement

IPL 2026 Playoffs:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ( Royal Challengers Bengaluru) ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 23 పరుగులు తేడాతో విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి జట్టుగా బెంగుళూరు ( RCB Play Offs) చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు 9 విజయాలు నమోదు చేసుకున్న బెంగళూరు, ఏకంగా 18 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉండడమే కాకుండా… ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది.

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్లిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు

Advertisement

పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Punjab Kings vs Royal Challengers Bengaluru) మధ్య ఆదివారం ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన బెంగుళూరు, నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ దుమ్ము లేపడంతో భారీ స్కోర్ నమోదు చేసుకుంది బెంగళూరు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైనప్పటికీ.. శశాంక్ సింగ్ ఒక్కడే 56 పరుగులతో రాణించాడు. అయినప్పటికీ త‌క్కువ బంతులలో ఎక్కువ ప‌రుగులు చేయాల్సిన‌ నేపథ్యంలో.. బెంగళూరు చేతిలో ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. దీంతో వరుసగా ఆరవ ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ ఆశలను కూడా కఠిన తరం చేసుకుంది.

సేఫ్ జోన్ లో SRH జట్టు

Advertisement

పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో సేఫ్ జోన్ లోకి హైదరాబాద్ వెళ్ళింది. ఇవాల్టి మ్యాచ్ లో బెంగళూరు పైన పంజాబ్ కింగ్స్ విజయం సాధించి ఉంటే, మూడవ స్థానానికి వెళ్ళేది. అప్పుడు హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోవాల్సిన పరిస్థితి నెలకొనేది. కానీ పంజాబ్ ఓడిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ జట్టు సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. తన తర్వాతి మ్యాచ్లలో వరుసగా రెండింటిలో గెలిస్తే హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. అటు గుజరాత్ టైటాన్స్ మరొక మ్యాచ్ లో విక్టరీ కొడితే.. ప్లే ఆఫ్స్ లోకి వెళ్లడం గ్యారంటీ. అంటే బెంగుళూరు ఇప్పటికే క్వాలిఫై కాగా, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ సులభంగా ప్లే ఆఫ్స్ లోకి వెళ్లడం గ్యారెంటీ అని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. నాలుగో స్థానం కోసం మాత్రం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడతాయి. చెన్నై తన తర్వాతి రెండు మ్యాచ్ లలో వరుసగా రెండిటిలో గెలిస్తే.. పంజాబ్ ఇంటిదారి పట్టే ప్రమాదం ఉంది. అటు రాజస్థాన్ రాయల్స్ మరో రెండు గెలిచినా కూడా పంజాబ్ కు కష్టమే అవుతుంది. మొత్తానికి ఈ మూడు జట్ల మధ్య గట్టి పోటీనే ఉంది. మరో మూడు రోజులు పోతే నాలుగో స్థానంపై క్లారిటీ రానుంది.

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×