BigTV English

Virat Kohli : ఓటమి బాధలో కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

Virat Kohli : ఓటమి బాధలో కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

  Virat Kohli :  టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సచిన్ తరువాత టీమిండియా తరపున ఒక్కొక్క రికార్డును బ్రేక్ చేస్తున్నారు. ఐపీఎల్ లో కోహ్లీ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో భాగంగా నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి చవి చూసింది. ఆర్సీబీ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. లోకల్ బాయ్ కే.ఎల్.రాహుల్ 53 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. 5 పరుగుల వద్దనే రాహుల్ క్యాచ్ ను కెప్టెన్ పాటిదార్ వదిలేయడంతో ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది.


ముఖ్యంగా ఆర్సీబీకి ఈ ఏడాది హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఏమాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది. ఈ సీజన్ ఆర్సీబీ ఐదు మ్యాచ్ లలో 3 విజయాలు సాధించగా.. అవన్నీ బయటి మైదానాల్లో కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ పై చిన్న స్వామి స్టేడియంలో ఓటమితో ఆర్సీబీ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఒకే వేదిక పై అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలిజట్టుగా బెంగళూరు నిలిచింది. సొంత మైదానంలో ఇప్పటి వరకు బెంగళూరు 45 మ్యాచ్ లలో ఓడిపోవడం గమనార్హం. అంతకు ముందు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. ఢిల్లీ 44 మ్యాచ్ ల్లో ఓడింది. డీసీ రికార్డును ఇప్పుడు బెంగళూరు బ్రేక్ చేసింది.

ఢిల్లీతో చేతిలో సొంత గడ్డపై ఓటమితో ఆర్సీబీ ప్లేయర్లు నైరాశ్యంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్రమైన బాధలో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలు చోట్ల విజయం సాధించినా సొంత గ్రౌండ్ లో వరుస పరాజయాలు ఆర్సీబీ ప్లేయర్లను బాధిస్తున్నాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ తరువాత సొంత గ్రౌండ్ లో ఓడిపోయిన జాబితాలో మూడో స్థానంలో కోల్ కతా ఉంది. ఈడెన్ గార్డెన్ లో 38 మ్యాచ్ లలో కేకేఆర్ ఓడిపోయింది. ఐపీఎల్ 18 టైటిల్ దిశగా సాగుతున్న ఆర్సీబీకి డీసీ కళ్లెం వేసింది. మరోవైపు ఐపీఎల్ 2025 డీసీ జోరు కొనసాగుతోంది. మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోగా.. ఢిల్లీ మాత్రం అజేయంగా ఉంది.


నిన్నటి మ్యాచ్ లో బెంగళూరు జట్టు 163 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. సాల్ట్ రన్ కావడంతో బెంగళూరు స్కోర్ కి బ్రేకులు పడ్డాయి. అయితే చివరిలో టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేయడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మరోవైపు డీసీ బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బంతులు వేయడంతో బెంగళూరు ఆటగాళ్లు చతికిల పడ్డారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో లివింగ్ స్టోన్, జితేష్ శర్మ విఫలం చెందారు. దీంతో బెంగళూరు భారీ స్కోరు చేయలేక సొంత గ్రౌండ్ లో ఓటమి పాలైంది.

 

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×