E-Paper
Advertisement

Vasishta N Simha: ‘ఓదెల 2’ నటుడు వశిష్ట భార్య.. స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?

Vasishta N Simha: ‘ఓదెల 2’ నటుడు వశిష్ట భార్య.. స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?
Advertisement

Vasishta N Simha: భాషతో సంబంధం లేకుండా నటీనటులకు అవకాశం ఇవ్వడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. వారికి భాష రాకపోయినా.. యాక్టింగ్ వస్తే చాలు.. తెలుగు సినిమాల్లో అవకాశం గ్యారంటీ. అలా కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి తెలుగులో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వశిష్ట సింహా. తాజాగా ‘ఓదెల 2’ (Odela 2) సినిమాలో మరోసారి విలన్‌గా కనిపించి ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ విడుదలకు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో ఇతర నటీనటులతో పాటు వశిష్ట కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటున్న సమయంలో తన భార్య గురించి మాట్లాడాడు వశిష్ట.

తనే వశిష్ట భార్య

Advertisement

వశిష్ట సింహా ఒక హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. 2023లో తన పెళ్లి జరిగింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. హరిప్రియా. కన్నడలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన హరిప్రియా.. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. చెప్పాలంటే వశిష్టకంటే హరిప్రియానే హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన ‘పిల్ల జమీందార్’లో లీడ్ రోల్‌లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. ఆ తర్వాత కూడా పలు తెలుగు సినిమాల్లో నటించినా తనకు హిట్ దక్కలేదు. ‘జై సింహా’ సినిమాలో బాలయ్యతో సైతం జోడీకట్టింది వశిష్ట భార్య హరిప్రియా.

బాధ్యతలు పెరిగాయి

Advertisement

2023లో హరిప్రియా (Hariprriya), వశిష్ట సింహా (Vasishta Simha) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి గురించి, వారి ప్రేమ గురించి తాజాగా ప్రస్తావించాడు వశిష్ట. ‘‘మా రెండో పెళ్లిరోజు బాబు పుట్టాడు. వాడికి ఇప్పుడు రెండు నెలలు. పెళ్లికి ముందు నేను వేరేలా ఉండేవాడిని. పెళ్లి తర్వాత బాధ్యత అంటే ఏంటో తెలిసింది. హరిప్రియా నా జీవితంలోకి రావడం వల్ల ఒక దిశ దొరికింది. బాబు పుట్టిన తర్వాత బాధ్యత పెరిగింది, సంతోషం పెరిగింది’’ అని చెప్పుకొచ్చాడు వశిష్ట. తనకంటే హరిప్రియా ఎక్కువ సినిమాల్లో నటించి స్టార్ అయినా కూడా ఇద్దరూ ఎలా కనెక్ట్ అయ్యారు అని అడగగా.. ప్రేమ అని సమాధానమిచ్చాడు. అంతే కాకుండా వీరిద్దరి కెరీర్ల మధ్య తేడా గురించి కూడా మాట్లాడాడు.

Also Read: పాకిస్థాన్ రేవ్ పార్టీలో కరీనా కపూర్.. షాక్‌లో ఫ్యాన్స్..

అప్పుడే ఫిదా

‘‘హరిప్రియా 15 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించింది. నేను డిగ్రీ పూర్తయిన తర్వాత కొన్నాళ్లు ఐటీలో పనిచేశాను. దాని తర్వాత సినిమాల్లో వచ్చాను. మా ఇద్దరికీ ఈ ప్రొఫెషన్ అంటే చాలా ప్రేమ ఉంది. నేను ఒక సినిమాలో చిన్న పాత్ర చేసి దాని ప్రీమియర్‌కు వెళ్లినప్పుడు తను అప్పటికే స్టార్ హీరోయిన్ అయినా కూడా నా దగ్గరకు వచ్చి నా వర్క్ గురించి మాట్లాడింది. నేను ఫిదా అయ్యాను. తనే నేను ప్రపోజ్ చేసిన మొదటి అమ్మాయి. ఒకరోజు రాత్రంతా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అప్పుడే ప్రపోజ్ చేసేశాను. పెళ్లి చేసుకుంటున్నాం అని క్లారిటీ వచ్చేవరకు ఎవ్వరికీ చెప్పొద్దు అనుకున్నాం’’ అంటూ హరిప్రియాతో తన ప్రేమకథను వివరించాడు వశిష్ట.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×