E-Paper
Advertisement

Richa Ghosh: కాటేర‌మ్మ అవతారమెత్తిన రిచా ఘోష్..10 బౌండ‌రీలు, 6 సిక్స‌ర్లు.. వణికిపోయిన అంబానీ ఫ్యామిలీ

Richa Ghosh: కాటేర‌మ్మ అవతారమెత్తిన రిచా ఘోష్..10 బౌండ‌రీలు, 6 సిక్స‌ర్లు.. వణికిపోయిన అంబానీ ఫ్యామిలీ
Advertisement

Richa Ghosh:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Womens Premier League 2026 ) నేపథ్యంలో ఇవాళ మరో కీలక పోరు జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ ( Royal Challengers Bengaluru Women vs Mumbai Indians Women ) మధ్య 16వ మ్యాచ్ నిర్వహించారు. వడోదర లోని బీసీఏ స్టేడియంలో ( BCA Stadium, Kotambi, Vadodara ) జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బెంగళూరు రాయల్ చాలెంజెర్స్‌ జట్టుపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. అయితే ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన బెంగళూరు బ్యాటర్ రిచా ఘోష్.. ముంబైకి చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్ లో 90 పరుగులు చేసి, బెంగళూరును గెలిపించినంత పని చేసింది. కాటేరమ్మ అవతారం ఎత్తిన రిచా ఘోష్ ( Richa Ghosh ).. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించింది. ఈ దెబ్బకు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కూడా గజగజ వణికిపోయింది.

Also Read: Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

రిచా ఘోష్ తాండవం..వణికి పోయిన ముంబై ఇండియన్స్

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు ( Royal Challengers Bengaluru Women vs Mumbai Indians Women ) మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు సెకండ్ బ్యాటింగ్ చేయగా ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 20 ఓవర్లు ఆడింది ముంబై ఇండియన్స్.. ఈ సందర్భంగా నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు 199 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 50లోపే ఐదు వికెట్లు కోల్పోయింది బెంగళూరు. అలాంటి సమయంలో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది లేడి మహేంద్ర సింగ్ ధోని రిచా ఘోష్. 50 బంతుల్లో 90 పరుగులు సాధించిన రిచా ఘోష్.. ఆరు సిక్సర్లు అలాగే 10 బౌండరీలు సాధించింది.

రిచా ఘోష్ కాటేరమ్మ అవతారం

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కాటేరమ్మ అవతారం ఎత్తింది రిచా ఘోష్. 90 పరుగులు చేసిన రిచా ఘోష్ 300 స్ట్రైక్ రేట్ సంపాదించింది. మొదటి 30 పరుగులు రాబట్టడానికి 30 బంతులు ఆడింది రిచా ఘోష్. అయితే ఆ తర్వాత 60 పరుగుల కోసం కేవలం 20 బంతులు మాత్రమే ఎదుర్కొంది. ఇలా సెకండాఫ్ లో 300 స్ట్రైక్ రేట్ సంపాదించింది. అయినప్పటికీ 15 పరుగుల తేడాతో బెంగళూరు ఓడిపోయింది. మరో మూడు బంతులు ఉంటే కచ్చితంగా బెంగళూరు గెలిచేదని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్ లో గెలుపుతో, ఈ టోర్న‌మెంట్ లో 3 విజ‌యాలు న‌మోదు చేసుకుంది ముంబై ఇండియ‌న్స్ మ‌హిళ‌ల జ‌ట్టు.

Advertisement

Also Read: Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×