Rinku Singh : టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh ).. అదిరిపోయే శుభవార్త చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా టి20 జట్టులో అదరగొడుతున్న ఈ డేంజర్ బ్యాట్స్మెన్ రింకు సింగ్… ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. త్వరలోనే.. టీమిండియా స్టార్ ఆటగాడు రింకు సింగ్… పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందులో భాగంగానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు ఈ స్టార్ ఆటగాడు రింకు సింగ్.
Also Read: Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంజెక్షన్లు తీసుకుంటున్న కోహ్లీ !
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాజ్వాది పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రియా సరోజ్ ను (Priya Saroj ) పెళ్లి చేసుకోబోతున్నాడు రింకు సింగ్. ఇందులో భాగంగానే తాజాగా ఎంపీ ప్రియా సరోజ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు ఈ యంగ్ క్రికెటర్ రింకు సింగ్. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో అందరూ… టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ కూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇవాళ ఉదయం రింకు సింగ్ అలాగే ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. సీక్రెట్ గా తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారట.
Also Read: TATA WPL 2025 Schedule: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
సరోజ్… మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో ఎంపిగా విజయం సాధించారు. 25 ఏళ్ల వయసులో మచ్లిషహర్ సీటును గెలుచుకున్న సరోజ్….అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరు. గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు ప్రియా సరోజ్. రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్…తుఫాని సరోజ్ కుమార్తె కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ నుంచి మూడుసార్లు పార్లమెంటు సభ్యులుగా తుఫాని సరోజ్ పనిచేయడం జరిగింది. ఆమె తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ప్రియా సరోజ్. ఆమె ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పట్టభద్రురాలైంది. నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో LLB పూర్తి చేసింది ప్రియా సరోజ్.
అయితే ప్రియా సరోజ అలాగే రింకు సింగ్… ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ఇక వీరిద్దరి వివాహం మరో నెల రోజుల్లోనే జరగబోతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి అయితే ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇది ఇలా ఉండగా… ఇటీవల ప్రకటించిన టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే టి20 సిరీస్ స్క్వాడ్ లో… రింకూ సింగుకు స్థానం దక్కిన సంగతి తెలిసిందే.
అయితే… మొన్నటి ఐపిఎల్ మెగా వేలంలో… రింకు సింగ్ ను రిటైన్ చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. 13 కోట్లకు రింకు సింగ్ ను రిటైన్ చేసుకుంది కేకేఆర్. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ను వదులుకొని… యంగ్ క్రికెటర్ రింగు సింగుకు అవకాశం ఇచ్చింది కేకేఆర్. దీంతో వచ్చే సీజన్లో రింకు సింగ్ కు కెప్టెన్సీ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.
Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍
– Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025