OTT Movie : ఓటీటీలో హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు మూవీ లవర్స్. ఈ సినిమాలు కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, కొత్త పెళ్ళికూతురు ఒక విచిత్రమైన గేమ్ ఆడాల్సివస్తుంది. ఆతరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
గ్రేస్ అనే అమ్మాయి అలెక్స్ లే డోమస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. అలెక్స్ లే డోమస్ అనే వ్యక్తి ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు. వీళ్ళకు బోర్డ్ గేమ్ లు తయారీ చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి. వీటి వళ్లే అలెక్స్ లే డోమస్ కుటుంబం ధనవంతులయ్యారు. గ్రేస్ తో అలెక్స్ వివాహం జరిగిన తర్వాత అసలు స్టోరీ మొదలౌతుంది. అలెక్స్ ఫ్యామిలీ ఒక సంప్రదాయ ఆట లో పాల్గొనమని గ్రేస్ ను కోరుతుంది. ఇది కొత్తగా కుటుంబంలోకి వచ్చిన సభ్యులు ఆడాల్సిన ఆట అని వాళ్ళు చెప్తారు. అది ‘హైడ్ అండ్ సీక్’ ఆటను పోలి ఉంటుంది. అయితే ఈ ఆట సాధారణమైనది కాదు. ఇది ఒక భయంకరమైన ఆచారం. దీనిలో కుటుంబ సభ్యులు గ్రేస్‌ను రాత్రంతా వేటాడి, ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. ఆమె వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
ఈ ఆట వెనుక ఒక రహస్య ఒప్పందం ఉంటుంది. ఇలా ఆడితే కుటుంబ సంపద పెరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు గ్రేస్ ఈ ఆటను ఆడటమే కాకుండా జీవితం కోసం పోరాడాల్సి వస్తుంది. ఆట మొదలయ్యాక కుటుంబ సభ్యుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళు మాత్రం ఆమెకు నరకం చూపిస్తారు. ఈ క్రమంలో ఆమె తెలివైన, ధైర్యవంతమైన వ్యక్తిగా మారుతుంది. చివరికి గ్రేస్ ఈ ఆటలో గెలుస్తుందా ? ఈ ఫ్యామిలీ వల్ల ఏమైనా ప్రమాదం వస్తుందా ? ఈ గేమ్ వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ హారర్ కామెడీ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : కూతురు కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చే తండ్రి … మతి పోగొట్టే ఇన్వెస్టిగేషన్ తో మెంటలెక్కించే సినిమా …
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ అమెరికన్ హారర్ మూవీ పేరు ‘రెడీ ఆర్ నాట్’ (Ready or Not). 2019 లో వచ్చిన ఈ సినిమా మాట్ బెట్టినెల్లి-ఓల్పిన్, టైలర్ గిల్లెట్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సమారా వీవింగ్, ఆడమ్ బ్రాడీ, మార్క్ ఓ’బ్రియన్, ఎలిస్ లెవెస్క్, నిక్కీ గ్వాడాగ్ని, హెన్రీ సెర్నీ,ఆండీ మెక్‌డోవెల్ నటించారు. ఈ సినిమా కథ గ్రేస్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.