Rishab Pant : టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ ల్లో రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు చేశాడు. రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఫామ్ కనబరిచినప్పటికీ సెంచరీ చేయలేకపోయాడు. తాజాగా మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డారు. కీపింగ్ చేస్తుండగా బంతి అతని వేలుకి బలంగాా తాకింది. దీంతో ఫిజియో థెరపిస్ట్ వచ్చి వే0లికి ట్రీట్ మెంట్ చేసినా నొప్పి తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వచ్చి కీపింగ్ చేస్తున్నాడు. గాయం పెద్దదై పంత్ బ్యాటింగ్ చేయలేకపోతే టీమ్ ఇండియా కి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. రిషబ్ పంత్ బ్యాటింగ్ లోపు కోలుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్..
బంతిని తీసుకున్న తరువాత పంత్ తీవ్రమైన నొప్పితో విల విల్లాడు. అంతకు ముందు ఓవర్ కూడా పంత్ కాస్త అసౌకర్యంగా కన్పించాడు. ఫిజియో వచ్చి మ్యూజిక్ స్ప్రే చేసినప్పటికీ అతడు నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటికి వెళ్లిపోయాడు. అతని స్థానంలో మైదానం నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఇక స్థానంలో సబ్ స్ట్యూట్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ మైదానంలో కీపింగ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా వికెట్ కీపర్ దుమ్ములేపుతున్నాడనాకున్న సమయంలో అతను గాయపడడం గమనార్హం. ఇటీవల తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ తొలి, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీలు చేశారు. రెండో టెస్టులో ఆప్ సెంచరీ చేశారు. మూడో టెస్టులో కూడా మరో సెంచరీ చేస్తాడని అందరూ ఎంతో ఆశతో ఎదురు చూడగా.. తాజాగా రిషబ్ పంత్ గాయపడ్డాడు. పంత్ గాయం తీవ్రం కాకూడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : Sara Tendulkar : సచిన్ కూతురు సారా ఇలా చేస్తుంది ఏంటి.. అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకుంటుందా !
బజ్ బాల్ ర్యాగింగ్..
భారత్ తో రెండో టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లాండ్.. మూడో టెస్టులో బజ్ బాల్ పై వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. మూడో టెస్ట్ లో తొలి రోజు తొలి సెషన్ లో 25 ఓవర్లు ఆడి 83 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు రెండో సెషన్ లో ఆచితూచి ఆడింది. టీ విరామ సమయానికి మరో వికెట్ నష్టపోకుండా 153 పరుగులు చేసింది. జోరూట్ 54 పరుగులు చేశాడు. ఓలీ పోప్ 44 పరుగులు చేశాడు. ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు ప్రయత్నిస్తున్నప్పటికీ వీరు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. రూట్, పోప్ ఇప్పటి వరకు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకు ముందు బజ్ బాల్ స్టోరీ నడిచింది. భారత కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఇంగ్లీషు బ్యాటర్లకు కవ్వించాడు. ఎంటర్టైన్ మెంట్ క్రికెట్ కనిపించడం లేదు.. వెల్ కమ్ బ్యాక్ టూ బోరింగ్ టెస్టు క్రికెట్ అని గిల్ కామెంట్ చేయడం స్టంప్ మైక్ లో వినిపించింది. బజ్ బజ్ బజ్ బాల్.. నేను బజ్ బాబ్ చూడాలి అని సిరాజ్ కవ్వించే ప్రయత్నం చేయడం విశేషం.
Rishabh Pant has walked off, and Dhruv Jurel has replaced him as the substitute wicketkeeper.
Hope it's nothing serious🤞
📸: Jio Hotstar pic.twitter.com/MxFwapAPQd
— CricTracker (@Cricketracker) July 10, 2025
Not great news for Team India! 🤕
Rishabh Pant walks off the field with a finger-tip injury. Dhruv Jurel takes over wicketkeeping duties. 🧤🇮🇳#DhruvJurel #RishabhPant #Tests #Sportskeeda pic.twitter.com/6kejaIWJLV
— Sportskeeda (@Sportskeeda) July 10, 2025