Chaithra Rai: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అలా పెళ్లిళ్లు చేసుకొని.. ఇలా తల్లిదండ్రులవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్స్.. మళ్లీ ఇంకో బిడ్డకు జన్మనిస్తూ ఆ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే ఇటీవల సమీరారెడ్డి పండంటి కొడుకుకు జన్మనివ్వగా.. మళ్లీ ఇంకో కొడుకుకి జన్మనిచ్చింది. అటు బుల్లితెర హీరోయిన్స్ ను మొదలుకొని ఇటు వెండితెర హీరోయిన్స్ కూడా ఒక్కరేసి ఇద్దరు పిల్లలకు జన్మనిస్తూ అభిమానులను ఆనందానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా మళ్లీ తల్లి కాబోతున్నాను అంటూ అభిమానులతో పంచుకుంది ఎన్టీఆర్ (NTR ) దేవరా (Devara) బ్యూటీ.
మళ్లీ తల్లి కాబోతున్న దేవర బ్యూటీ..
ఆమె ఎవరో కాదు చైత్ర రాయ్ (Chaithra Rai).. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె ఎన్టీఆర్.. హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆయనకు భార్య పాత్రలో చైత్ర రాయ్ అద్భుతంగా ఒదిగిపోయింది. ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు కూడా లభించింది అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చైత్ర రాయ్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది. అందులో “మా జీవితంలోకి మరో హార్ట్ బీట్ రాబోతోంది”. ఇప్పుడు మేము ముగ్గురం.. త్వరలో నలుగురం కాబోతున్నాము” అంటూ ఆ ఆనంద క్షణాలను అభిమానులతో షేర్ చేసింది. ఇక చైత్ర మళ్లీ తల్లి కాబోతోందని తెలిసి అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చైత్ర రాయ్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చైత్ర రాయ్ నటించిన సీరియల్స్..
చైత్ర రాయ్ జీ కన్నడ ఛానల్ లో ప్రీమియర్ అయిన రాధా కళ్యాణ అనే సోప్ ఒపేరా లో విశాఖ పాత్రతో భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారమైన అష్టా చమ్మా సీరియల్ స్వప్న అనే పాత్రతో మంచి పేరు సొంతం చేసుకుంది. ఈ సీరియల్ తర్వాత మనసున మనసై, ఒకరికి ఒకరు, దట్ ఈజ్ మహాలక్ష్మి, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, రాధకు నీవే రా ప్రాణం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చైత్ర రాయ్ వ్యక్తిగత జీవితం..
కర్ణాటక కూర్గ్ లో వాసు రాయ్ , గులాబీ రాయ్ దంపతులకు 1990 మార్చి 29న జన్మించిన ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. హోటల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె ప్రముఖ ఇంజనీర్ అయిన ప్రసన్న శెట్టి (Prasanna Shetty) ని వివాహం చేసుకుంది. ఇక తర్వాత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన చైత్ర ఇప్పుడు మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమయ్యింది.
ALSO READ:Kaushal Manda: హీరో నానిని అవమానించిన బిగ్ బాస్ కౌశల్.. హోస్ట్ గా వేస్ట్ అంటూ!
?utm_source=ig_web_copy_link