BigTV English

Pant : కోలుకుంటున్న పంత్.. బాలీవుడ్ స్టార్స్ పరామర్శ..

Pant : కోలుకుంటున్న పంత్.. బాలీవుడ్ స్టార్స్ పరామర్శ..

Pant : రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్ లో చికిత్స పొందుతున్న టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ కోలుకుంటున్నాడు. చిన్న ప్లాస్టిక్‌ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్ డైరెక్టర్‌ శ్యామ్‌ తెలిపారు. ముఖంపై గాయాలకు డెహ్రాడూన్ మ్యాక్స్‌ ఆసుపత్రిలో ఈ సర్జరీ జరిగినట్లు పేర్కొన్నారు. తొలుత పంత్ ను ఢిల్లీకి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా తరలించాలని భావించారు. కానీ చివరికి మ్యాక్స్‌ ఆస్పత్రిలో నే శస్త్రచికిత్సను నిర్వహించారు.


డీడీసీఏ నుంచి ఓ బృందం డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి వెళ్లి రిషభ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్లాస్టిక్‌ సర్జరీ అవసరం కావడంతో అక్కడే వైద్యులు పంత్‌కు ఆపరేషన్ నిర్వహించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం నిర్వహించిన ఎక్స్‌రేల్లో పంత్‌ కుడి కాలు లిగ్మెంట్‌ స్థాన భ్రంశమైందని, నుదురు భాగంలో చిట్లిన గాయాలు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మెదడు, వెన్నెముకకు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ తీశారు. ఎలాంటి సమస్య లేదని తాజాగా వైద్యులు ప్రకటించారు. పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టిన నిమిషాల వ్యవధిలోనే మంటల్లో కాలిపోయిన విషయాన్ని సీసీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. శుక్రవారం వేకువ జామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా రిషభ్ నడుపుతున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టి ఈ ప్రమాదానికి గురైంది. అయితే హైవేలో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు వెంటనే పంత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే పంత్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించిన స్థానికులను సత్కరిస్తామని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ ప్రకటించారు. రోడ్డు, రవాణా, హైవేస్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘గుడ్‌ సమరితాన్’ పథకం కింద సన్మానం చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంట సమయం బాధితుడికి చాలా కీలకం. ఆ సమయంలో ట్రీట్‌మెంట్‌ అందిస్తే ప్రాణాలకు ప్రమాదం ఉండదు. ఇలాంటి సామాజిక పరివర్తనను ప్రతి ఒక్కరిలో కల్పించడానికి ఈ పథకం ప్రవేశ పెట్టామని డీజీపీ తెలిపారు. ఇలా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సహాయం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


పంత్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే అతడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. అలాగే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. ప్రధాని వెంటనే స్పందించడంపై బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. పంత్ కుటుంబానికి భరోసా ఇస్తూ వారితో మాట్లాడిన ప్రధానికి కృతజ్ఞతులు తెలిపింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్‌ పంత్ ను బాలీవుడ్ నటులు అనిల్ కపూర్ , అనుపమ్ ఖేర్ పరామర్శించారు.‌ పంత్ అద్భుతమైన వ్యక్తి. యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఇప్పుడు దేశమంతా అతడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోంది. త్వరలోనే అతడి కోలుకొని వస్తాడని ఆశిస్తున్నామని అన్నారు. అతడి తల్లిని, కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పామని తెలిపారు. పంత్ అభిమానుల్లా తాము ఇక్కడికి వచ్చామన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ సూచించారు.

Related News

Cough Syrup Deaths: దగ్గు మందు తాగిన ఆరుగురు చిన్నారులు మృతి.. ఈ సిరప్ లు బ్యాన్.. దర్యాప్తు చేపట్టిన కేంద్రం

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే చీఫ్ విజయ్ సంచలన నిర్ణయం

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం

UP News: 75 ఏళ్ల వయస్సులో పెళ్లి.. ఫస్ట్ నైట్ జరిగిన తర్వాతి రోజే ప్రాణాలు విడిచిన వరుడు

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

LPG Cylinder Price: పండగ వేళ సిలిండర్ ధరలకు రెక్కలు.. ఆపై కేంద్రం మరొక శుభవార్త

TVK Vijay: నాపై ప్రతీకారం తీర్చుకోండి.. తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ స్పందన

Asia Cup Trophy: పెద్ద ప్లానింగే.. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే భారత్ ఆసియా కప్ తీసుకోలేదా?

Big Stories

×