RJ Mahvash: టీమిండియా స్టార్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ జంట తమ వివాహ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో వీరికి ముంబై ఫ్యామిలీ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీ వర్మకు చాహల్ దాదాపు నాలుగు కోట్లకు పైగా భరణం చెల్లించాడు. విడాకుల అనంతరం ఎవరి జీవితాల్లో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. కానీ చాహాల్ మాత్రం విడాకుల అనంతరం తరచూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.
ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న తరువాత చాహల్.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకి ఆర్జే మహ్వాష్ తో డేటింగ్ లో ఉన్నాడనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ ఊహాగానాలకు తగ్గట్టుగానే కొన్ని ఆధారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంలో దుబాయిలోని స్టేడియంలో వీరిద్దరూ కలిసి మ్యాచ్ వీక్షించిన దృశ్యాలు, ఆ తరువాత వీరిద్దరూ ఒకరినొకరు ఇంస్టాగ్రామ్ లో ఫాలో కావడం, పోస్టులకు కామెంట్లు చేయడం వంటి చర్యలతో వీరి మధ్య సంబంధం గురించి నెటిజన్లు చర్చించసాగారు.
ఆ తర్వాత ఆర్జే మహ్వాష్ తో చాహల్ పంజాబ్ కింగ్స్ జట్టు బస్సులో ప్రయాణిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇటీవల వీరిద్దరూ కలిసి లండన్ వీధుల్లో తిరుగుతున్న వీడియో కూడా నెట్టింట హల్చల్ చేసింది. దీంతో వీరు నిజంగానే డేటింగ్ లో ఉన్నారా..? అన్న ప్రచారం ఊపందుకుంది. ఇక వీరి వీడియోలకు వేలాది లైక్ లు, కామెంట్లు రావడం చూస్తుంటే.. ఈ జంట గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆర్జె మహ్వాష్ ని ఉద్దేశించి ఓ షాకింగ్ పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. ” ఎవరి భర్తను దొంగిలించావు..? చీటింగ్” అంటూ ఓ పోస్ట్ చేశాడు నెటిజన్.
ఈ ప్రశ్నపై వెంటనే స్పందించింది ఆర్జే మహ్వాష్. ఆ యువకుడు అడిగిన ప్రశ్నని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసింది. అలాగే దానికి ఓ ఘాటు రిప్లై కూడా ఇచ్చింది. ” ఒకరి భర్తను దొంగలించడానికి.. మోసం చేస్తున్నానా..? నాకు తెలియదు కాని, నేను దొంగతనం చేయలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ ఒకరి భర్తను దొంగిలించడం మోసం” అంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నను.. తన రిప్లైని ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇక ప్రస్తుతం ధనశ్రీ వర్మ తన కెరీర్ పై దృష్టి పెడుతూ కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
Also Read: BCCI: ఇద్దరు కోచ్ లపై బీసీసీఐ సంచలన నిర్ణయం.. కొత్త బౌలింగ్ కోచ్ అతడే..?
మరోవైపు చాహల్ టీమిండియాలో స్థానం సంపాదించేందుకు దేశవాళీ క్రికెట్ ఆడుతూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో అద్భుతంగా రాణించాడు. అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త దిశగా అడుగులు వేస్తున్నాడు. మాహ్వాష్ తో చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నాడంటూ ఊహగానాలు కొనసాగుతున్నప్పటికీ.. వారు అధికారికంగా ఈ విషయాన్ని ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. మరి ఈ జంట మరో క్రికెట్ – సెలబ్రిటీ ప్రేమ కథగా మారుతుందా..? అనే ఆసక్తికరమైన ఎదురుచూపు అభిమానులది.