BigTV English

Sanjay Manjrekar : రెండో టెస్టులో రోహిత్ తప్పులు చేసాడు : సంజయ్ మంజ్రేకర్

Sanjay Manjrekar : రెండో టెస్టులో రోహిత్ తప్పులు చేసాడు : సంజయ్ మంజ్రేకర్
Sanjay Manjrekar

Sanjay Manjrekar : సౌతాఫ్రికా గడ్డపై జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది. అందరూ సంతోషించే వేళ మాజీ ప్లేయర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీలో ఒక మేజర్ మిస్టేక్ జరిగిందని అన్నాడు.


అయిపోయిన పెళ్లికి హిందుస్థానీ మేళం లా, గెలిచిన మ్యాచ్ పై ఇంకెందుకు పీక్కోవడమని సంజయ్ పై కామెంట్ చేస్తున్నారు. నిజం నిప్పులాంటిది, అదెప్పటికైనా తెలియాలని సంజయ్ అంటున్నాడు. ఇంతకీ ఏమిటా? నిజం? అని చూస్తున్నారా? అయితే రండి.

రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తర్వాత టీమ్ ఇండియా 153 పరుగులు చేసింది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా 176 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 78 పరుగుల లీడ్ దొరికింది. ఇందులో ఓపెనర్ మార్ క్రమ్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ విషయంపైనే సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు.


సెకండ్ ఇన్నింగ్స్ లో మార్ క్రమ్ అలా రెచ్చిపోతుంటే,తనని అవుట్ చేయడానికి రోహిత్ శర్మ ఎటువంటి కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు చేయలేదని అన్నాడు. ఎంతసేపు బుమ్రా, ముఖేష్ తోనే బౌలింగ్ చేయించాడని విమర్శించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన స్పెల్ తో ఇరగదీసి ఆరు వికెట్లు తీసిన సిరాజ్ ని రోహిత్ ఎందుకు పక్కన పెట్టాడో అర్థం కాలేదని అన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో సిరాజ్ సేవలను ఎందుకు ఆలస్యంగా వినియోగించుకున్నాడని అన్నారు.

నిజానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో సిరాజ్ అలా వికెట్లు తీసుకోవడం వల్లే టీమ్ ఇండియా పుంజుకుని ఆడిందని తెలిపాడు. అలాంటిది సెకండ్ ఇన్నింగ్స్ లో ఇన్ టైమ్ లో సిరాజ్ ను వాడకపోవడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇది నిజంగా కెప్టెన్సీ వైఫల్యమేనని తేల్చి పరేశాడు. దీంతో మార్ క్రమ్ సెంచరీ సాధించాడని తెలిపారు. రోహిత్ కి కెప్టెన్సీపై ఏమన్నా శ్రద్ధ తగ్గిందా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×