Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వయసు ఇప్పుడు 38 ఏళ్లు. ఈ వయసులో చాలామంది రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఇంకా కసితో ఆడుతున్నాడు. తనకు అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచ కప్ ని 2027 లో సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే టెస్ట్, టి-20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
Also Read: SHAMI-BCCI: షమీవి అన్ని దొంగ నాటకాలే.. మాతో గేమ్స్ ఆడుతున్నాడు.. బీసీసీఐ సీరియస్
వన్డే ప్రపంచ కప్ 2027 కి మరో రెండేళ్ల సమయం ఉంది. అప్పటివరకు రోహిత్ కేవలం 15 కంటే తక్కువ వన్డే లు మాత్రమే ఆడతాడు. అలాగే మధ్యలో ఐపిఎల్ లో మెరుపులు మెరిపిస్తాడు. ఈ క్రమంలో ప్రస్తుతం రోహిత్ శర్మ ముందున్న అతిపెద్ద సవాల్ తన ఫిట్నెస్ ని కాపాడుకోవడమే. అలాగే బ్యాటింగ్ లో తన లయను కోల్పోకుండా ఉండడం కూడా ఎంతో ముఖ్యం.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు తన వన్డే కెప్టెన్సీ ని కోల్పోయిన రోహిత్ శర్మకు.. ఇదే చివరి సిరీస్ అంటూ ఎన్నో కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటికీ తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు రోహిత్. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. 3 వన్డేల సిరీస్ లో.. మొదటి వన్డేలో కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరిన హిట్ మ్యాన్.. రెండవ వన్డేలో 73 పరుగులతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సిడ్నీ వేదికగా జరిగిన చివరి వన్డేలో 121 పరుగులతో నాటౌట్ గా నిలిచి తానేంటో మరోసారి ప్రపంచ క్రికెట్ కి చూపించాడు. సిడ్నీ మ్యాచ్ లో అద్భుతంగా రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు ఉంటాడో..? లేదో..? అన్న అనుమానాలు మొన్నటి వరకు అందరిలో మెదిలాయి. కానీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత రోహిత్ శర్మ ఖచ్చితంగా కొనసాగుతాడు అనే నమ్మకం వచ్చింది. ఈ క్రమంలో రాబోతున్న వన్డే సిరీస్ లలో కూడా రోహిత్ శర్మ ఇలాగే రాణించి.. భారత్ కి మరో ఐసీసీ టైటిల్ అందించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించే రోహిత్ శర్మ.. ఆఫ్ ఫీల్డ్ లో ఎంత సరదాగా ఉంటాడోనన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయనలోని ఈ సరదా కోణం మరోసారి బయటపడింది. ముంబైలో వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్న ఓ జంటకు రోహిత్ శర్మ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. తన ఇంటి సమీపంలో పెళ్లి ఫోటో షూట్ చేసుకుంటున్న ఓ కొత్త జంటను చూసి.. వారి ఆనందంలో పాలుపంచుకుంటూ రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ నూతన వధూవరులు తమ పెళ్లి ఫోటో షూట్ లో నిమగ్నమై ఉన్న సమయంలో… తన ఇంటి బాల్కనీలో ఉన్న రోహిత్ శర్మ వారిని గమనించాడు. వెంటనే అక్కడ నివసిస్తున్న “ఆజ్ మేరే యార్ కీ షాదీ హై” { ఈరోజు నా స్నేహితుడి పెళ్లి} అనే పాటకు తనదైన స్టిల్ లో కిటికీ తెరిచి డాన్స్ చేస్తూ కనిపించాడు. ఊహించని ఈ పరిమాణానికి ఆ జంట ఆనందంతో ఆశ్చర్యపోయింది. దీంతో ఆ వరుడు నవ్వుతూ రోహిత్ శర్మ కి గౌరవపూర్వకంగా నమస్కరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్లు తెగ షేర్ చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">