E-Paper
Advertisement

ధోనిపై బ్రియాన్ లారా రౌడీయిజం…ఔట్ కాక‌పోయినా పెవిలియ‌న్ వెళ్లిపోయాడుగా

ధోనిపై బ్రియాన్ లారా రౌడీయిజం…ఔట్ కాక‌పోయినా పెవిలియ‌న్ వెళ్లిపోయాడుగా
Advertisement

MS Dhoni VS Brian Lara Fight: మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ( Dhoni)..అతి త‌క్కువ కాలంలోనే ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగిన గొప్ప కెప్టెన్. సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్రుడు.. టీమిండియాకు రెండు ఐసీసీ వరల్డ్ కప్ లు తేవడమే కాకుండా ఛాంపియన్ ట్రోఫీ కూడా అందించాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంత రేంజ్ లో ధోని పేరు తెచ్చుకున్నాడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోనిని విండీస్ దిగ్గ‌జం బ్రియాన్ లారా (Brian Lara) ఘోరంగా అవమానించాడు. మైదానం నుంచి వెళ్ళిపోవాలని రౌడీయిజం చేశాడు. నువ్వు బ్యాటింగ్ చేసేందుకు అన‌ర్హుడివి అంటూ అంపైర్, ధోనితో గొడ‌వ పెట్టుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక మహేంద్ర సింగ్ ధోని కూడా బ్రియాన్ లారా మాట విని.. పెవిలియన్ కు వెళ్లిపోయిన సంఘటన 2006 అంటిగ్వా ( Antigua) టెస్టు సందర్భంగా జరిగింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అసలు ధోని వర్సెస్ లారా మధ్య జరిగిన గొడవ ఏంటి ?

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య 2006 సమయంలో టెస్ట్ సిరీస్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొదటి మ్యాచ్ అంటిగ్వా వేదికగా నిర్వహించారు. ఈ మ్యాచ్ దాదాపు 5 రోజుల పాటు సాగి డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ సందర్భంగా దూకుడుగా ఆడాలని కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆదేశాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్ లో భయంకరంగా బ్యాటింగ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని 69 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. దూకుడుగా ఆడే ప్రయత్నంలో డేవ్ మహమ్మద్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు ధోని. నాలుగో సిక్సర్ కోసం ప్రయత్నించి గంగాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

అయితే ఆ క్యాచ్ పట్టుకునే క్రమంలో బౌండరీ లైన్ ను గంగా లెగ్ తగిలినట్టు రీప్లేలో కనిపించింది. దీంతో అంపైర్ నాటౌట్ గా ప్రకటించేశాడు. ఈ క్రమంలో అప్పటి కెప్టెన్ బ్రియాన్ లారా రెచ్చిపోయాడు. అది ఔట్ అంటూ గొడవకు దిగాడు. తమ ప్లేయర్లు సరిగ్గానే క్యాచ్ పట్టుకున్నారు.. నువ్వు గ్రౌండ్ వదిలి వెళ్ళిపో అంటూ ధోని దగ్గరకు వచ్చి రౌడీయిజం కూడా చేశాడు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తేల్చి చెప్పేశాడు. దీంతో గొడవ పెద్దగానే జరిగింది. ఇదంతా గమనించిన మహేంద్ర సింగ్ ధోని… బ్రియన్ లారాకు గౌరవం ఇచ్చి పెవిలియన్ కు వదిలి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశం అయింది. ధోనిని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అదే సంఘటన వైరల్ గా మారింది.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

 

?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

Related News

ఓట‌మి భ‌యంతోనే సీనియ‌ర్లను దించుతున్నారు..టీమిండియాపై అక్త‌ర్ ఫైర్

న‌లుగురు న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌కు గాయాలు…టీమిండియాను గెలిపిందుకే ఈ డ్రామాలంటూ క‌మ్రాన్ ఆరోప‌ణ‌లు!

న్యూజిలాండ్ ఎదురుదాడికి గుర్నూర్, అకీబ్ న‌బీ త‌ట్టుకోలేరు..ప్యాంట్లు త‌డిపేసుకుంటారు

బాబ‌ర్ ఆజం పెద్ద వెధ‌వ‌..సింప‌తీ కోసమే డ్రామాలు చేస్తున్నాడు

అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు

పాకిస్తాన్ కు భ‌య‌ప‌డే 33 ఏళ్లు దాటిన వాళ్ల‌ను దించుతున్నారు..ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

మహ్మద్ అమీర్ యమ డేంజర్.. వాడు ఐపీఎల్‌లోకి వస్తే కోహ్లీ, రోహిత్ లాంటోళ్లు తట్టుకోలేరు

Big Stories

Advertisement
×