Eng vs SA : సాధారణంగా ఒకప్పుడు క్రికెట్ లో సౌతాఫ్రికా ఎంత అద్భుతంగా ఆడినా సెమిస్ లో లేదా ఫైనల్ లో ఆ జట్టు ఓటమి పాలవుతుండటం మనం చూశాం. కొన్ని సందర్భాల్లో ఎంత మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక సమయాల్లో విఫలం చెందడం.. గాయాల పాలవ్వడంతో సౌతాఫ్రికా కీలక మ్యాచ్ ల్లో ఓటమి పాలయ్యేది. సౌతాఫ్రికాలో డేంజరెస్ ఆటగాళ్లు ప్రతీ సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా డివిలియర్స్, డూప్లిసిస్ వంటి ఆటగాళ్లు ఎంతటి సంచలనాలు నమోదు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది డివిలియర్స్ ఉన్న సమయంలో సౌతాఫ్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోయింది. కానీ డివిలియర్స్ కెప్టెన్సీలో రిటైర్మెంట్ క్రికెట్ ఆటగాళ్లలో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా టెంబా బవుమా కెప్టెన్సీలో వరుస విజయాలు సాధించడం విశేషం.
Also Read : Under-16 : 160 బంతుల్లో 486 పరుగులతో రెచ్చిపోయిన అండర్-16 కుర్రాడు
ఇటీవల జరిగిన WTC టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 లో ఆస్ట్రేలియా పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టెస్ట్ ఛాంపియన్ షిప్ కి కెప్టెన్ కి టెంబా బవుమా నే..మరోవైపు ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ కూడా సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా సౌతాఫ్రికా జట్టే విజయం సాధించడం విశేషం. 3 మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచింది సౌతాఫ్రికా. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా సిరీస్ కైవసం చేసుకోవడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే సిరీస్ లో కూడా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా విజయం సాధించింది. మూడో మ్యాచ్ మాత్రం ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 330/8 పరుగులు సాధించింది.
ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 325/9 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ని పరిశీలించినట్టయితే.. ఓపెనర్ మార్క్రమ్ 64 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రికెల్టన్ 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు. బవుమా 4, 75 బంతుల్లో 85 పరుగులు చేసాడు బ్రీట్జ్కే. సౌతాఫ్రికా జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టబ్స్ 58, బ్రెవిస్ 42, కోబ్రిన్ బోష్ 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముత్తుస్వామీ 7, మహారాజ్ 1 పరుగులు చేశాడు.ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఓపెనర్ జెమీ స్మిత్ డకౌట్ అయ్యాడు. బెన్ డకెట్ 14, రూట్ 61, జాకోబ్ బెతెల్ 58, హార్రీ బ్రూక్ 33, జోస్ బట్లర్ 61, విల్ జాక్స్ 39, బ్రైడెన్ కార్స్ 07, జోఫ్రా ఆర్చర్ 27, అదిల్ రసీద్ 27, షకీబ్ మహ్మద్ 2 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 325 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయింది. ఇక సౌతాఫ్రికా జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ టెంపా బవుమా ను వీడు మగాడ్రా బుజ్జీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
– Won the WTC ✅
– Won the ODI Series in Australia. ✅
– Won the ODI Series in England. ✅THIS IS CAPTAIN TEMBA BAVUMA ERA IN SOUTH AFRICAN CRICKET…!!!! 🔥 pic.twitter.com/3esZT6KgCI
— Johns. (@CricCrazyJohns) September 5, 2025