Rohit Sharma : ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో భారత వాతావరణ సంస్థ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా క్రికెటర్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) స్టేటస్ పెట్టాడు. మొన్నటి నుంచి మహారాష్ట్ర (maharastra) లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో ముఖ్యంగా చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ ఉద్దేశంతోనే రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశాడు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ప్రకటన వైరల్ గా మారింది. ఒక క్రికెటర్ జాగ్రత్త అని చెప్పడంతో ప్రజల గురించి మా అభిమాన క్రికెటర్ ఏవిధంగా స్పందిస్తున్నాడో చూడు అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.
Also Read : BCCI Betrays Country : బీసీసీఐ దోశద్రోహి.. జైషాకు డబ్బుల కక్కుర్తి అంటూ?
రోహిత్ పై ప్రశంసలు..
మరోవైపు ఇతర క్రికెటర్ల అభిమానులతో పోల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముంబైలోని ఛత్రపతి వివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు 250 కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్టు సమాచారం. ఉదయం 9 గంటల నుంచి 9.50 గంటల ప్రాంతంలో 8 విమానాలను దారి మళ్లీంచినట్టు తెలిపారు. విమాన సర్వీసులు సగటున 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఎయిర్ పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్ సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించింది. పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసాయి. వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని సూచించాయి. మరోవైపు భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబై లోకల్ రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
వరదలో కొట్టుకెళ్లిన కారు..
మరోవైపు రోడ్లపై లోతట్లు ప్రాంతాలు జలమయం కావడంతో అందులో కార్లు, టూవీలర్ వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక మొత్తానికి ముంబై నగరం అంతా అల్లాకల్లోలం అయింది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవాలని సూచించింది. అవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. భారీ వర్షం కారణంగా పలు రోడ్లు జలమయం కావడం.. అంధేరి సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ తదిత ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. వర్షపు నీరు కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు హార్బర్ లైన్ లోని చునాభట్టి వద్ద రైలు పట్టాలు నీటమునిగాయి. సియోన్ ప్రాంతంలోని రైల్వే స్టేషన్ లో భారీగా వరద నీరు చేరడంతో రైల్లు నెమ్మదిగా కదులుతున్నాయి. ఓ కారు వరద నీటిలో చిక్కుకోని బయటికి వెళ్లలేదు. కొంత మంది వ్యక్తులు ఈదుకుంటూ వెళ్లి కారు డోర్లు తెరిచి అందులో ఉన్న ప్రయాణికులను బయటికి తీశారు. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.
https://www.instagram.com/stories/rohitsharma45/3702498995894373658?utm_source=ig_story_item_share&igsh=MWE5djRkMnNnamRrOA==