Dance video: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా హవానే కనిపిస్తోంది. చాలా మంది తమ టాలెంట్ ను సోషల్ మీడియాలో ప్రూఫ్ చేసుకుంటున్నారు. కొంత మంది డ్యాన్స్ వీడియోలు చేస్తూ యూట్యూబ్, ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. వీడియో బాగుంటే నెటిజన్లు లైకులు, కామెంట్లు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకుని చాలా మంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అయితే తాజాగా రాజస్థాన్ కు చెందిన ఓ మహిళా ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ వీడియో కింద తెగ కామెంట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాజస్థానీ మహిళ, జోధ్ పూర్ కు చెందిన కంచన్ అగర్వాల్ సాంప్రదాయ చీర ధరించి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఘుంఘట్‌లో షకీరా ‘హిప్స్ డోంట్ లై’ పాటకు నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కంచన్ అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతే కొన్ని గంటల్లోనే 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో ఆమె షకీరా సిగ్నేచర్ హుక్ స్టెప్స్‌ను అద్భుతంగా చేసింది. తన సొంత టాలెంట్ ను కూడా జోడించి డ్యాన్స్ చేసింది. ఈ ప్రదర్శన లక్షల నెటిజన్లను ఆకర్షించింది.
ALSO READ: OFMK: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైన వారందరూ అప్లై చేసుకోవచ్చు.. డోంట్ మిస్
ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ వీడియోను లైక్ చేయడంతో ఇది మరింత హైలైట్ అయింది. 2006లో షకీరా, వైక్లెఫ్ జీన్ లతో విడుదలైన ‘హిప్స్ డోంట్ లై’ పాట ఆ సమయంలో యువతను ఊర్రూతలూగించింది. ఇంట్రెస్టిగ్ బీట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ ఫేమస్ అయిపోయింది. ఈ పాట షకీరా కొలంబియన్, బెల్లీ డాన్స్ సంప్రదాయాలకు సంబంధించిన లోతైన సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఈ పాట టైటిల్ ప్రపంచవ్యాప్తంగా పాప్ కల్చర్‌లో మంచి పేరును సంపాదించింది.
ALSO READ: Viral video: ఇవి వరద నీళ్లా.. స్విమ్మింగ్ పూలా..? ఎలా ఈత కొడుతున్నారో చూడండి, వీడియో వైరల్
అయితే జోద్ పూర్ మహిళా కంచన్ డ్యాన్స్ చూసిన నెటిజన్లు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘డ్యాన్స్ తో పాటు ఆమె చీరను గ్రేస్‌ఫుల్‌గా నిర్వహించిన తీరు అద్భుతం’ అని ప్రశంసించారు. మరొకరు ఈ వీడియోను నేను చాలా సార్లు చూశాను.. మహిళ అంత బాగా డ్యాన్స్ వేసింది అని కామెంట్ చేశాడు.. కొందరు ఆమె నృత్యం కంటే చీర, ఘుంఘట్‌ను నిర్వహించిన తీరుపై ఎక్కువ ఆకర్షితులయ్యారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత మంచి డ్యాన్స్ వీడియో మొదటిసారి చూస్తున్నాను’ అని మరొక నెటిజన్ కామెంట్ చేసుకొచ్చాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసేయండి.