OTT Movie : మలయాళం ఇండస్ట్రీలో ఫహద్ ఫాసిల్ ఒక క్రేజీ యాక్టర్. పుష్ప తరువాత తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఈ హీరో కోవిడ్ టైమ్ లో నటించిన ఒక సినిమా కేక పెట్టిస్తోంది. కేరళలోని రబ్బర్ ప్లాంటేషన్‌లో జరిగే ఈ స్టోరీ క్రైమ్, ఫ్యామిలీ డైనమిక్స్ తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫహద్ నటన సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ సినిమా స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కూడా గెలిచింది. దీని స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ప్రైమ్ వీడియోలో
‘జోజి’ (Joji) మలయాళ క్రైమ్ డ్రామా సినిమా. దిలీష్ పోతన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ఫహద్ ఫాసిల్ (జోజి), బాబురాజ్ (జోమోన్), ఉన్నిమాయ ప్రసాద్ (బిన్సీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోవిడ్ సమయంలో థియేటర్ రిలీజ్ కి ఛాన్స్ లేకపోవడంతో, డైరెక్ట్ గా 2021 ఏప్రిల్ 7న Amazon Prime Videoలో రిలీజ్ అయ్యింది. 1 గంట 53 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDb లో 7.8/10 రేటింగ్ ను పొందింది.
స్టోరీలోకి వెళ్తే
కేరళలోని ఎరుమెలీలో రబ్బర్ ప్లాంటేషన్‌లో పనచెల్ కుటుంబం నివసిస్తుంటుంది. ఇక్కడ కుట్టప్పన్ (పీఎన్ సన్నీ) ఒక ధనవంతుడైన కట్టుబాట్లు కలిగి ఉన్న వ్యక్తి. తన ముగ్గురు కొడుకులను జోమోన్ (బాబురాజ్), జైసన్ (జోజి ముండక్కాయం), జోజి (ఫహద్ ఫాసిల్) కంట్రోల్ లో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు. జోమోన్ ఒక డివోర్సీ, తన కొడుకు పోపీతో ఉంటాడు. జైసన్ తన భార్య బిన్సీతో ఉంటాడు. జోజి ఇంజనీరింగ్ డ్రాప్‌అవుట్, ధనవంతుడు కావాలని కలలు కంటుంటాడు. కానీ తండ్రి అతన్ని “లూజర్”గా చూస్తాడు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో, కుట్టప్పన్ స్ట్రోక్‌తో హాస్పిటల్‌లో చేరతాడు. జోజి, బిన్సీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తారు.
కుట్టప్పన్ రికవరీ అవుతుండగా, జోజి , బిన్సీ సపోర్ట్‌తో, తండ్రి మందులు మార్చి చనిపోయేలా చేస్తాడు. ఈ మర్డర్‌ని కవర్ చేయడానికి జోజి మరిన్ని నేరాలు చేస్తాడు. జోమోన్, పోపీ, లోకల్ ప్రీస్ట్ ఫాదర్ కెవిన్ (బాసిల్ జోసెఫ్) జోజిని అనుమానిస్తారు. జోజి తన క్రైమ్స్ దాచడానికి మరింత హింసకు దిగుతాడు. అతని ప్లాన్స్ మరో లెవెల్ కి వెళ్తాయి. క్లైమాక్స్‌లో స్టోరీకూడా మరింత రసవత్తరంగా ఉంటుంది. జోజి అరాచకాలు బయటపడతాయా ? ఎందుకు తండ్రిని చంపాలనుకున్నాడు ? ఇతని అరాచకాలు ఎవరు బయటపెడతారు ? క్లైమాక్స్‌లో ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్