Kohli-Rohith : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్తితి నెలకొంది. ముఖ్యంగా కొందరూ సీనియర్లు జూనియర్లు కాగా.. జూనియర్లు సీనియర్లు అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ -ఏ జట్టుకు టీమిండియా కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడుతారని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే అనధికారిక మూడు వన్డేల సిరీస్ లో వీరిని ఆడించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం కనపిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడాలంటే.. దేశవాళీ మ్యాచ్ లు ఆడాల్సిందేనని బీసీసీఐ రూల్ పెట్టినట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read : Rishabh Pant : బ్రాంకో టెస్ట్ కోసం పంత్ అదిరిపోయే స్కెచ్… కొత్త తరహా ట్రీట్మెంట్ తీసుకుంటూ కసరత్తు
దీంతో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరుగబోయే అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు. అలాగే దులీప్ ట్రోఫీకి దూరమైన బెంగాళ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తిరిగి జట్టులోకి వచ్చేశాడు. అతని తో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, దేవదత్త్ పడిక్కల్ చోటు లభించింది. నితీశ్ కుమార్ రెడ్డి ఇంగ్లాడ్ సిరీస్ మధ్యలోనే గాయం కారణంగా స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా ఫిట్ నెస్ సాధించడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో అదరగొడుతున్న తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ ను సెలెక్టర్లు ఎంపిక చేసారు.
ఫాస్ట్ బౌలర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, గర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, యష్ ఠాకూర్ లను ఎంపిక చేశారు. రెండో టెస్ట్ కి టీమిండియా స్టార్ ప్లేయర్లు కే.ఎల్.రాహుల్, మహ్మద్ సిరాజ్ జట్టుతో చేరనున్నారు. బీసీసీఐ ఈ వి|షయాన్ని వెల్లడించింది. మరోవైపు స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగనున్న టెస్ట్ సిరీస్ కి శ్రేయస్ అయ్యర్ ని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఏ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు భారత్ కి రానుంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 23 వరకు జరుగనుంది. రెండు మ్యాచ్ లు లక్నోలోని ఏకానా స్టేడియంలో జరుగనున్నాయి. మూడు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే జట్టును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆ జట్టు ప్రకటిస్తే కానీ ఓ క్లారిటీ రానుంది. ఎవరెవరు ఆడుతారు.. ఎవరెవరు ఆడరు అనేది తెలుస్తోంది.