Happy Retirement: గత కొంతకాలంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో కూడా రోహిత్, కోహ్లీ మరోసారి విఫలమయ్యారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. డ్రా చేసుకోవాలనుకున్న కనీసం 90 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది.
Also Read: MS Dhoni: మెల్ బోర్న్ తో ధోనికి ఉన్న బంధం ఇదే.. సరిగ్గా 10 ఏళ్లు !
ఇలాంటి పరిస్థితులలో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు ముందుండి జట్టును నడిపిస్తారని అంతా భావించారు. కానీ ఈ ప్లేయర్స్ బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. దీంతో జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఇలా వరుసగా విఫలమవుతున్న వీరిద్దరూ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “హ్యాపీ రిటైర్మెంట్” # HappyRetirement అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు.
విరాట్ – రోహిత్ ల టెస్ట్ కెరీర్ ముగిసిపోయిందని.. భవిష్యత్తులో వీరు టెస్టులు ఆడే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ఈ నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ సిరీస్ లో ఘోరంగా విఫలమయ్యాడు రోహిత్. మూడు మ్యాచ్ లలోని ఐదు ఇన్నింగ్స్ లలో 6.27 సగటుతో కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో 10 పరుగులే అతడి బెస్ట్ స్కోర్ అని చెప్పాలి.
ఇక కోహ్లీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ లో 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సిరీస్ లో కోహ్లీ నాలుగు మ్యాచ్ లలోని 7 ఇన్నింగ్స్ లలో 27.83 సగటుతో 167 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. ఇది మినహా సిరీస్ లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. ఇక వీరిద్దరి ఆట తీరుపై తాజాగా భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీ తన కెరీర్ ని ఇంకా కొనసాగించాలని. రోహిత్ శర్మ మాత్రం ఈ సిరీస్ మోగి శాఖ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశాడు. ” కోహ్లీ ఇంకా కొన్నాళ్లు ఆడొచ్చు. అతడు మరో మూడేళ్లు ఆడే అవకాశం ఉంది. అతని ఫిట్నెస్ కూడా బాగుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో అతడు అవుట్ అయిన తీరును వెంటనే మరచిపోవాలి. ఇక రోహిత్ శర్మ విషయంలో ఆందోళన తప్పడం లేదు.
Also Read: MCG Crowd: భారత్ vs ఆసీస్ మ్యాచ్ లో అరుదైన రికార్డు.. మ్యాచ్ చూసేందుకు !
అతడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రోహిత్ పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. బంతిని చాలా ఆలస్యంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో రోహిత్ ఔట్ అయిన తీరు ఇబ్బందికరమే. అతడు ఫ్రంట్ ఫుట్ మీద బంతిని చాలా బాగా ఆడతాడు. కానీ ఈసారి మాత్రం పుల్ చేయబోయి పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా బౌలర్లు కూడా రోహిత్ కి కట్టుదిట్టంగా బాల్స్ వేశారు. దీంతో రోహిత్ అటాక్ చేసేందుకు ప్రయత్నించి వారికి దొరికిపోయాడు” అని పేర్కొన్నారు రవిశాస్త్రి.