MS Dhoni: 2014 డిసెంబర్ 30.. క్రికెట్ అభిమానులకు ఈ తేదీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ కి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించిన రోజు. ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి నేటికీ పదేళ్లు. 2014లో భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించింది. మొదటి టెస్ట్ మ్యాచ్ కి అప్పటి కెప్టెన్ ధోని {MS Dhoni} దూరం కావడంతో.. ఆ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు.
Also Read: MCG Crowd: భారత్ vs ఆసీస్ మ్యాచ్ లో అరుదైన రికార్డు.. మ్యాచ్ చూసేందుకు !
అనంతరం ధోని మిగతా మ్యాచ్ లకు కెప్టెన్ గా ఉన్నాడు. అయితే మూడవ టెస్ట్ మ్యాచ్ అనంతరం ఎవరు ఊహించని రీతిలో ధోని {MS Dhoni} టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ ని భారత జట్టు అద్భుత ఆట తీరుతో డ్రా చేసుకుంది. అయితే సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ధోని రిటైర్మెంట్ ప్రకటించడం షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.
పదేళ్ల క్రితం ఇదే మేల్ బోర్న్ లోని బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసిన అనంతరం ధోని {MS Dhoni} రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే జట్టు సభ్యులతో ధోనీ తన రిటైర్మెంట్ గురించి చెప్పగానే సురేష్ రైనా తో పాటు మరికొందరు జట్టు సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ కూల్ అని పిలవబడే ధోని.. మైదానంలో ఎంతో ప్రశాంతంగా, అద్భుతమైన కెప్టెన్ గా పేరుగాంచాడు. స్టంప్స్ వెనకాల అతని చురుకుదనం భారత్ కి ఎన్నో గెలుపులను అందించింది.
2004లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ధోని.. తన కెరీర్ లో 90 టెస్టులు ఆడాడు. భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అతను {MS Dhoni} ఓ పవర్ హిట్టర్ అని ప్రపంచానికి తెలియజెప్పాడు. 90 టెస్టులు ఆడిన ధోని 38.09 సగటుతో 4,876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ధోని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 224 పరుగులు.
Also Read: Pro Kabaddi League 2024 Final: ప్రో కబడ్డీ విన్నర్‌గా హరియాణా స్టీలర్స్…ఇదే తొలిసారి !
ధోని కెప్టెన్సీ లో భారత్ టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ ర్యాంక్ ను అందుకోగలిగింది. ఇక 2019 జూలై 9న న్యూజిలాండ్ తో ఆడిన వన్డే మ్యాచ్ అనంతరం ధోని {MS Dhoni} ఇంటర్నేషనల్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. ధోని కెప్టెన్సీలో 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్ గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.