Mumbai Indians – Oval Invincibles: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్టార్ టీమ్ ముంబై ఇండియన్స్ (ఎమ్.ఐ) మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ తో పాటు, భారతదేశంలోని అత్యంత ధనిక పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ద 100 లీగ్ లోకి అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికా, అమెరికా, యూఏఈ లీగ్ లలో కూడా జట్లను కొనుగోలు చేసింది.
Also Read: IND vs ENG 4th T20I: నేడే 4వ టీ20… రింకూ, అర్షదీప్ రీ-ఎంట్రీ..షమీ ఔట్!
తాజాగా ఈ లీగ్ కి చెందిన ఓవల్ ఇన్వెన్సిబుల్ జట్టు వేళానికి రాగా.. కళ్ళు చెదిరే ధర పెట్టి ముంబై ఆ టీమ్ ని సొంతం చేసుకుంది. దాదాపు 123 మిలియన్ పౌండ్ల భారీ ధరకు ఈ జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అక్కడ ఒక జట్టులో ప్రధాన వాటాను కొనుగోలు చేసింది. ఇలా కొనుగోలు చేసిన మొదటి ఐపీఎల్ ఫ్రాంచైజీగా ఎమ్ఐ అవతరించింది. నిజానికి ఈ టీమ్ మొత్తం విలువ 123 మిలియన్ పౌండ్లు ఉండగా.. ఇందులో 49% వాటాను ఈసీబీ అమ్మకానికి పెట్టింది.
దీంతో ఎంఐ యాజమాన్యం.. ప్రత్యర్థులు కనీసం ఊహించని విధంగా భారీ ధరతో బిడ్డింగ్ వేసి గెలుపొందారు. నివేదికల ప్రకారం జనవరి 30 గురువారం రోజున ఈసీబీ ఓవల్ ఇన్వెన్సబుల్ వేలం ప్రక్రియను ప్రారంభించింది. అందులో తన 49% వాటాను అమ్మకానికి పెట్టింది. దీనిని ముంబై ఇండియన్స్ దాదాపు 61 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు.. 658 కోట్ల భారీ బిడ్ ద్వారా కొనుగోలు చేసింది. ది 100 లీగ్ లో ఓవల్ ఇన్వెన్సిబుల్ కి మంచి రికార్డు ఉంది.
గత రెండు సీజన్లలో ఆ జట్టే ఛాంపియన్ గా నిలిచింది. ఈ సీజన్ లో కూడా గెలిచి హైట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. అలాంటి జట్టు కొనుగోలుతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తన రాకను ఘనంగా చాటుకుంది. ఇందులో 8 ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఏర్పాటుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2018 లో తన ఫ్రాంచైజీ క్రికెట్ ప్రస్థానం మొదలుపెట్టింది. ఈ జట్టు ఐపిఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి.
Also Read: Navjot Singh Sidhu: 33 కేజీలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఆ వ్యాధి సోకిందా ?
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. కానీ గత సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమైంది. గత సీజన్ లో 14 మ్యాచ్ లకు కేవలం నాలుగు మాత్రమే గెలిచి టేబుల్ లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో మాత్రం బొంబాయి ఇండియన్స్ బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ మార్చ్ 21 నుంచి ప్రారంభం అవుతుందని ఇప్పటికే లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. మే నెల చివరి వరకు.. అంటే రెండు నెలలకు పైగా ఈ టోర్నీ అభిమానులకు వినోధాన్ని పంచనుంది.