టీమిండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) జట్ల మధ్య నాల్గవ T20 జరుగనుంది. శుక్రవారం అంటే నేడు నాల్గవ T20 మ్యాచ్ జరుగనుంది. ఇవాళ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ( Maharashtra Cricket Association Stadium, Pune )టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గవ T20 జరుగనుంది. కోల్‌కతా, చెన్నైలో విజయాల తర్వాత, సూర్యకుమార్ యాదవ్ సేన రాజ్‌కోట్‌లో ఓడింది. రాజ్ కోట్ లో జరిగిన మూడవ T20Iలో తడబడింది టీమిండియా. దీంతో ఇంగ్లాండ్ మళ్లీ గాడిలో పడింది. ఈ తరుణంలోనే… ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 2న ముంబైలో జరిగే ఆఖరి మ్యాచ్ కంటే ముందే టీమ్ ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంది.
Also Read:Navjot Singh Sidhu: 33 కేజీలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఆ వ్యాధి సోకిందా ?
ఒక్క మ్యాచ్ గెలిస్తే.. టీమిండియాకు సిరీస్ వస్తుంది. అయితే..ఇవాళ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నాల్గవ T20 జరుగనుంది. ఇందులో గెలిచి సిరీస్ గెలవాలని టీమిండియా చూస్తుంటే… మరో మ్యాచ్ గెలిచి… సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ 5 టీ20 ల సిరీస్ లో 2-1 తేడాతో టీమిండియా లీడింగ్ లో ఉంది. ఇక ఇవాళ పుణెలో జరిగే మరో కీలక మ్యాచ్‌తో భారత్ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. వెన్ను నొప్పి కారణంగా రెండో, మూడో మ్యాచ్‌లకు దూరమైన రింకూ సింగ్ ( Rinku Singh ) ఫిట్‌గా ఉన్నాడని, ఈ 4వ టీ20 మ్యాచ్ నేపథ్యంలో అందుబాటులో ఉన్నాడని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ ధృవీకరించారు. ధృవ్ జురెల్ స్థానంలో రింకూ వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో…. వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే లేదా రమణదీప్ సింగ్ వంటి అదనపు సీమ్-బౌలింగ్ ఆల్ రౌండర్‌ను కూడా టీమిండియా తీసుకునే ఛాన్స్ ఉంది.
ఇక అటు మూడో టీ20లో అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిచ్చింది టీమిండియా. కానీ ఇవాళ పుణెలో జరిగే మ్యాచ్‌కు అర్ష్‌దీప్ సింగ్ తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంది. ICC పురుషుల T20I ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ను గెలుచుకున్న అర్ష్‌దీప్, పవర్‌ప్లే ప్రారంభంలో స్ట్రైకింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ. మొదటి, రెండో టీ20 లో కూడా పవర్‌ప్లే ప్రారంభంలో వికెట్లు తొందరగా పడగొట్డాడు అర్ష్‌దీప్ సింగ్. ఇక ఇవాళ కీలక మ్యాచ్ కావడంతో.. అర్ష్‌దీప్ సింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. మరి అర్ష్‌దీప్ సింగ్ వస్తే… షమీ ఆడతాడా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Rinku Singh Injury: టీమిండియాకు బిగ్ రిలీఫ్.. డేంజర్ ప్లేయర్ రింకూ వచ్చేస్తున్నాడు ?
IND vs ENG అంచనా
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్ (WK), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.