BigTV English

Krunal Pandya : వివాదంగా పాండ్యా బౌలింగ్.. త్రో వేస్తున్నాడంటూ ట్రోలింగ్

Krunal Pandya :  వివాదంగా పాండ్యా బౌలింగ్.. త్రో వేస్తున్నాడంటూ ట్రోలింగ్

Krunal Pandya : టీమిండియా క్రీడాకారుడు కృణాల్ పాండ్యా ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ తరపున ఆడుతున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 47 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ నిదానంగా ఆడితే.. మరో ఎండ్ లో ఉన్న కృణాల్ పాండ్యా త్వరగా ఔట్ అయి ఉంటే మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచేది కష్టంగా నే ఉండేది. 


Also Read : Indian Cricketers : ఈ టీమిండియా క్రికెటర్స్ పచ్చి తాగుబోతులు !

ఇదిలా ఉంటే.. తాజాగా కృణాల్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  స్పిన్నర్ అని చెప్పి విసిరేస్తున్నావు కదరా..? అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ సీజన్ లో కృణాల్ పాండ్యా బౌలింగ్ కూడా అద్భుతంగా చేశారు. ఇటీవల ఆర్సీబీ గెలిచిన రెండు, మూడు మ్యాచ్ ల్లో కీలక వికెట్లు తీయడంతో ఆర్సీబీ విజయాల బాట పట్టింది.  ఈ సీజన్ లో ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ రెండు అద్భుతంగా ఉండటంతోనే విజయాలు కొనసాగుతున్నాయి. లేదంటే ఆర్సీబీ కూడా చెన్నై బాట పట్టి ఉండేదని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. అటు మిడిల్ ఓవర్స్‌లో డీసీ బ్యాటర్స్‌కు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి పరుగులను అడ్డుకున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి డీసీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌ పై హర్షం వ్యక్తం చేశాడు పాండ్య.. తాను ఏం చేయాలనే దానిపై మొదటి నుంచీ స్పష్టత ఉందని చెప్పుకొచ్చాడు.


బ్యాటింగ్ ఈ స్కోరు సాధించడానికి విరాట్ సహకారమే కారణం కూడా చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటుతుండటంతో ఇతని పై త్రో బౌలింగ్ అంటూ వివాదం సృష్టిస్తున్నారు.  120 kmph తో బౌలింగ్ చేసి ఎలా విసిరి.. వేస్తున్నావురా..? అంటూ చెప్పరాని మాటలతో ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. ఇంతకు ముందు కృణాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు. ముంబైలో బౌలింగ్ లో, బ్యాటింగ్ లో రెండింటిలో అంతగా రాణించకపోవడంతో వేలానికి వచ్చేశాడు. ఈ సీజన్ లో కొనుగోలు చేసిన ఆర్సీబీ తరపున అద్భుతంగా బౌలింగ్ చేయడం.. బ్యాటింగ్ చేయడంలో ఆర్సీబీ అభిమానుల మనస్సును గెలుచుకున్నాడు కృణాల్ పాండ్యా. 

“ఓ బౌలర్‌గా ప్రత్యర్థులతో పోలిస్తే ఒక అడుగు ముందే ఉండాలని అనుకుంటా. బౌలింగ్ మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు చేశా. బ్యాట్స్‌మన్ బలాబలాలను నాకు అనుకూలంగా మార్చుకుని బౌలింగ్ చేస్తాను. బౌన్సర్లు, యార్కర్‌లు అన్నీ ట్రై చేస్తున్నా. గతంలోనూ బౌలింగ్ చేశా. తదుపరి బంతి ఎలా ఉంటుందా అని తికమక పెట్టేలా చేసేందుకు ప్రయత్నిస్తుంటా” అని ఓ మ్యాచ్ సందర్భంగా  చెప్పుకొచ్చాడు ఆర్సీబీ ఆటగాడు కృణాల్ పాండ్యా. 

?igsh=Y3lvM3B1Z2w1ZHUw

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×