Black Cat Entry In PAK vs NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్రై సిరీస్ లో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం {ఫిబ్రవరి14} న న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 49.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్ప కూలింది. పాకిస్తాన్ బ్యాటర్లలో మహమ్మద్ రిజ్వాన్ 76 బంతులలో 46 పరుగులు, తయ్యబ్ తాహీర్ 38, సల్మాన్ అఘా 65 బంతుల్లో 45 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
Also Read: Pakisthan – Kohli: కోహ్లీ, RCB జిందాబాద్..బాబర్ డౌన్ డౌన్ అంటూ పాక్ ఫ్యాన్స్ రచ్చ…!
ఇక న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఓరూర్కే నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మైకెల్ బ్రాస్ వెల్ 2, మిచెల్ శాంట్నర్ 2, నాథన్ స్మిత్ 1, జాకబ్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ని పాకిస్తాన్ బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 45.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 58 బంతులలో 57 పరుగులు, టామ్ లాథమ్ 64 బంతులలో 56 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇక కాన్వే 48, కేన్ విలియమ్సన్ 34 పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో నషీమ్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రూర్కేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సల్మాన్ అఘాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దాక్కాయి. దీంతో సొంత గడ్డపై జరిగిన ఈ సిరీస్ ఫైనల్ లో ఆతిధ్య పాకిస్తాన్.. న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది.
అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ నల్ల పిల్లి కారణంగా మ్యాచ్ కి కాసేపు అంతరాయం కలిగింది. పాకిస్తాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఆ సమయంలో మిచెల్ 9, కాన్వే 48 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అదే సమయంలో ఓ నల్ల పిల్లి గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అది ఆటగార్లను ఇబ్బందేం పెట్టలేదు కానీ.. గ్రౌండ్ లో అటు ఇటు తిరిగేసరికి స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ ఇబ్బంది పడాల్సి వచ్చింది.
Also Read: Telugu Warriors – CCL 2025: ఉప్పలో తమన్ మాస్ డ్యాన్స్..తెలుగు వారియర్స్ విక్టరీ !
దీంతో అప్పటికే 48 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్న కాన్వే తన ఫోకస్ కోల్పోయాడు. ఆ నల్ల పిల్లి కారణంగా హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ పిల్లి గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మ్యాచ్ నిలిపివేసి సిబ్బంది అక్కడి నుండి దానిని పంపించేశారు. ఈ నల్ల పిల్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దాని కారణంగానే కాన్వే హఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు నల్ల పిల్లి గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పాకిస్తాన్ కి అపశకునం అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) February 14, 2025