BigTV English

Rp Singh: వాడికి 23 కోట్ల దండగ.. వెంకటేష్ అయ్యర్ పరువు తీసిన టీమిండియా మాజీ బౌలర్

Rp Singh: వాడికి 23 కోట్ల దండగ.. వెంకటేష్ అయ్యర్ పరువు తీసిన టీమిండియా మాజీ బౌలర్

Rp Singh : ఐపీఎల్ లో ఈ ఏడాది పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటముల పరంపరం కనసాగిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఆ జట్టు వరుసగా నాలుగు హోం మ్యాచ్ లలో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్  బౌలర్ షమీ అరుదైన ఘనత సాధించాడు. తొలి బంతికే వికెట్ తీశాడు. ఇది నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ విశేషం. ఇక మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రూ.23.75 కోట్లు పెట్టి వెంకటేష్ అయ్యర్ అనే ఆటగాడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ లో 8 మ్యాచ్ లు ఆడి 135 పరుగులు మాత్రమే చేశాడు. అయితే వేలం ధర అతడి పై ఒత్తిడిని పెంచుతుండొచ్చు అని మాజీ క్రికెటర్ ఆర్.పీ.సింగ్ అభిప్రాయపడటం విశేషం.


Also Read :  Nitish Kumar Reddy : RCBలాగే మేమూ ప్లేఆఫ్స్ చేరుతాం.. డేంజర్ బెల్స్ పంపిన తెలుగోడు

వాస్తవానికి ఒక ఆటగాడికి భారీ ధర పెట్టి కొనుగోలు చేశారంటే అతను మెయిన్ ప్లేయర్ నో.. లేక కాబోయే కెప్టెన్ అనో జట్టు నమ్ముతున్నట్టే. కానీ వెంకటేష్ అయ్యర్ ఆ రెండు కూడా కాలేకపోయారని.. వేలంలో కేకేఆర్ ఘోరంగా విఫలం చెందిందని పేర్కొన్నారు మాజీ క్రికెటర్ ఆర్.పీ.సింగ్. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడితే వాటిలో కేవలం 3 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ కోల్ కతా స్థానం మాత్రం మారదు. ప్రస్తుతం కోల్ కతా 6 పాయింట్లతో కొనసాగుతోంది. ఒకవేళ ఇవాళ విజయం సాధిస్తే.. 8 పాయింట్లు ఉంటాయి. కానీ అదే 7 వ స్థానంలో ఉండటం విశేషం.


ఇక నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తేనే కోల్ కతా ప్లే ఆప్స్ కి చేరుతుంది. కోల్ కతాతో పాటు సన్ రైజర్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 5 వ స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ కోల్ కతాతో జరిగే మ్యాచ్ లో కూడా విజయం సాధించినట్టయితే మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కోల్ కతాలో వెంకటేష్ అయ్యర్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కూడా రిషబ్ పంత్ ని రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను కూడా అంతగా ప్రదర్శన కనబరచడం లేదు. వాస్తవానికి ఐపీఎల్ లో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు ఎవ్వరూ కూడా అంతగా ఫర్పామెన్స్ కనబరచరు. ఈ సీజన్ లోనే కాదు.. ఏ సీజన్ లో అయినా ఇలాంటిదే జరుగుతూ వస్తోంది. అందుకే ఈ సారి కోల్ కతా నుంచి వెంకటేష్ అయ్యర్, లక్నో నుంచి రిషబ్ పంత్ ని భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేసినప్పటికీ వాళ్లు తమ ప్రతిభను మాత్రం కనబరచడం లేదు. ముందు ముందు వెంకటేష్ అయ్యర్ ఏమైనా సత్తా చాటుతాడేమో వేచి చూడాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×