BigTV English

SA vs Aus 1st ODI : ఆస్ట్రేలియాలో చిత్తుచిత్తుగా ఓడించిన సౌత్ ఆఫ్రికా.. ఏకంగా 98 పరుగుల తేడాతో

SA vs Aus 1st ODI : ఆస్ట్రేలియాలో చిత్తుచిత్తుగా ఓడించిన సౌత్ ఆఫ్రికా.. ఏకంగా 98 పరుగుల తేడాతో

SA vs Aus 1st ODI : ఈ మధ్య కాలంలో సౌతాఫ్రికా జట్టు విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇటీవలే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా సీనియర్ ఆటగాళ్ల లీగ్ లో సైతం డివిలీయర్స్ కెప్టెన్సీలో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా లో సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. అయితే ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో  296 పరుగులు చేసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 40.5 ఓవర్లలోనే 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 98 పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది.


Also Read :  Shreyas Iyer : గంభీర్ పాలిటిక్స్… సర్పంచ్ సాబ్ ను తొక్కేశారు కదరా…. ఇంత అన్యాయమా అంటూ ఫ్యాన్స్ ఫైర్

అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా 


ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు మాక్రమ్ 82 పరుగులు చేయగా.. రికెల్టన్ 33, బవుమా 65, బ్రిజ్కే57, స్టబ్స్ 0, బ్రెవిస్ 6, మల్డర్ 31, మహారాజ్ 13, సుబ్రాయన్ 1 (రటౌట్),  బర్గర్ 1 నాటౌట్ గా నిలిచాడు. 296/8 పరుగులు చేసింది సౌతాఫ్రికా జట్టు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ద్వార్షిస్ 2, హెడ్ 4, జంపా 1 వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే.. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు ట్రావిస్ హెడ్ 27, మిచెల్ మార్ష్ 88, లబ్ షేన్ 1, కామెరాన్ గ్రీన్3, ఇంగ్లీషు 5, హార్డ్లీ 4, ద్వార్షిస్ 33, నాతన్ ఎల్లిస్ 14, జంపా11, హెజిల్ వుడ్ 1 నాటౌట్ దీంతో 40.5 ఓవర్లలో 198 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా గడ్డ పై ఆస్ట్రేలియా జట్టును సౌతాఫ్రికా జట్టు ఓడించడం చరిత్ర అనే చెప్పాలి.

ఆస్ట్రేలియాతో తలపడాలంటే.. వణుకే..!

వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టుతో మరే జట్టు తలపడుతున్నా.. ఆ జట్టుకు వణుకు పడుతుంది. ఎందుకంటే..? ఆస్ట్రేలియా జట్టు అంత పటిష్టంగా ఉంటుంది. అటు ఉమెన్స్ జట్టు అయినా.. మెన్స్ జట్టు అయినా క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా రాణిస్తుంటుంది. ముఖ్యంగా పురుషుల టెస్ట్ జట్టు అయినా, వన్డే జట్టు అయినా, టీ-20 జట్టు అయినా ఏ జట్టు అయినా అద్భుతంగా రాణిస్తారు. ఓపెనర్లు స్ట్రాంగ్ గా ఉంటారు. గాలిలో సిక్సులు కొట్టే విధ్వంసకర బ్యాటర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. కానీ ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ కాస్త ఫామ్ కోల్పోయాడు. సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో తొలి వన్డేలో సౌతాఫ్రికాను విజయం వరించింది. లేదంటే సొంత గడ్డ పై కంగారులు రెచ్చిపోయి సౌతాఫ్రికాను మట్టి కరిపించేవారు. మిగతా వన్డేల్లో కచ్చితంగా ఆస్ట్రేలియా జట్టు పుంజుకొని సౌతాఫ్రికా జట్టుకి  స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ సారి సౌతాఫ్రికా జట్టు కూడా చాలా బలంగానే ఉండటం విశేషం.

Related News

Pakistan: ఇండియా పౌర‌స‌త్వం తీసుకోనున్న పాక్ క్రికెట‌ర్‌.. RSSను మ‌ధ్య‌లోకి లాగి మ‌రీ !

AUS VS NZ: 50 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన‌ మిచెల్ మార్ష్‌…న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ కైవ‌సం

India ODI Captain: రోహిత్ శ‌ర్మ‌కు ఎదురుదెబ్బ‌..ఇక‌పై వ‌న్డేల‌కు కొత్త కెప్టెన్‌, ఎవ‌రంటే ?

IND VS WI: మూడు రోజుల్లోనే తొలి టెస్ట్ ఫినీష్‌..వెస్టిండీస్ పై టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Dhruv Jurel: 5 ఏళ్లకే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ, గోల్డ్ చైన్ తాక‌ట్టు పెట్టిన త‌ల్లి..జురెల్ జీవితాన్ని మార్చేసిన బ‌స్సు ప్ర‌మాదం !

Nitish Kumar Reddy Catch: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన నితీశ్ కుమార్..గాల్లోకి ఎగిరి మ‌రీ

Sanju Samson: కేర‌ళ‌లో సంజు శాంసన్ రేంజ్ చూడండి..ఏకంగా హెలికాప్ట‌ర్ లోనే మాస్ ఎంట్రీ

Pakistan Girls: పాకిస్థాన్ జ‌ట్టులో కిరాక్ పోరీ…ఈ ఫోటోలు చూస్తే మ‌తిపోవాల్సిందే

Big Stories

×