SA 20 2026 auction : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా ఒక ఆడగాడు ఎప్పుడూ ఫామ్ కనబరుస్తాడో తెలియని పరిస్థితి. మరో ఆటగాడు ఎప్పుడూ ఫామ్ లోనే ఉంటాడు. కానీ కీలక మ్యాచ్ లో మాత్రం చేతులు ఎత్తేస్తాడు. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే సౌతాఫ్రికా క్రికెట్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం విశేషం. సౌతాఫ్రికా క్రికెటర్ బ్రెవిస్ జాక్ పాట్ కొట్టాడు. సౌతాఫ్రికా 20 సీజన్ 4 వేలంలో అతడిని ప్రిటోరియా క్యాపిటల్స్ రూ.8.30 కోట్లకు దక్కించుకుంది. లీగ్ హిస్టరీలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. బేబీ ఏబీ డివిలియర్స్ కి గుర్తింపు పొందిన బ్రెవిస్ ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై తరుపున ఆడుతున్నారు.
Also Read : Suryakumar Yadav : పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపిన సూర్య కుమార్… నమ్మకద్రోహం అంటూ ట్రోలింగ్!
నో లుక్ సిక్సర్లు కొట్టడంలో ఈ చిచ్చర పిడిగు చాలా దిట్ట. అటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ మార్క్రమ్ ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ.7 vhkuకోట్లకు దక్కించుకుంది. అయితే కావ్య పాప ఈసారి మార్క్రమ్ ను కొనుగోలు చేయలేదు. అయితే సౌతాఫ్రికా యువ క్రికెటర్, జూనియర్ ఏబీ డివిలియర్స్ రికార్డు సృష్టించాడనే చెప్పాలి. మరోవైపు ఈ లీగ్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగస్వాములుగా ఉన్నాయి. వాస్తవానికి 2023లో SA 20 లీగ్ ప్రారంభమంది. తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ టైటిల్ గెలిచింది. మూడో సీజన్ లో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్.. ఎంఐకేఫ్ టౌన్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో హ్యాట్రిక్ టైటిల్ ను తృటిలో చేజార్చుకుంది. ఈ మూడు సీజన్లలో సన్ రైజర్స్ జట్టును ఎయిడెన్ మార్కరమ్ నడిపించాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈసారి అతను సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టును వదిలేయడం గమనార్హం.
దీంతో అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ కి చెందిన డర్బన్ సూపర్ జెయింట్స్ రూ.7కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. అది కొనుగోలు చేసిన కొద్ది సేపటికే డెవాల్ట్ బ్రెవిస్ అతని రికార్డును బ్రేక్ చేశాడు. 22 ఏళ్ల వయస్సులోనే బ్రెవిస్ భారీ ధర పలకడం విశేషం. 2022 ఐపీఎల్ లోకి ఆరంగేట్ర చేసిన డెవాల్ట్ బ్రెవిస్ ఇప్పటివరకు 16 మ్యాచ్ ఆడి 455 పరుగులు చేసాడు. అయితే గత సీజన్ లో రీప్లేస్ మెంట్ ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసకర బ్యాటర్ గా గుర్తింపు పొందిన బ్రెవిస్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేశాడు. టీ-20లతో తన కెరీర్ ప్రారంభించిన బ్రెవిస్.. ఈ ఏడాది వన్డేతో పాటు టెస్ట్ లోకి ఆరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో 10 టీ-0 మ్యాచ్ లు ఆడి 318 పరుగులు చేశాడు. 6 వన్డేల్లో 110 పరుగులు.. రెండు టెస్ట్ ల్లో 84 పరుగులు చేసాడు బ్రెవిస్.