WAR 2 Movie Review : ఎన్టీఆర్ బాలీవుడ్లో చేసిన స్ట్రైట్ మూవీ ‘వార్ 2’ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు మెప్పించింది? అనే విషయాన్ని ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
కబీర్(హృతిక్ రోషన్) రా(RAW) కి దూరమయ్యి చీకటిలోకి వెళ్ళిపోయి టెర్రరిస్ట్ గ్రూప్ తో సత్సంబందాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతని లక్ష్యం వివిధ దేశాలకి చెందిన టెర్రరిస్ట్ గ్రూప్..లను సిండికేట్ గా ఫామ్ చేసుకుని ఆడిస్తున్న కలిని అంతం చేయడం. ఈ ప్రాసెస్ లో కబీర్ తన గురువు సునీల్ లూత్రా(అశుతోష్ రానా) ని చంపాల్సి వస్తుంది. దీంతో రా మొత్తం కబీర్ ను అంతం చేయాలని చూస్తుంటుంది. ఇలా ఓ దేశ ద్రోహి అనే ముద్ర మోయాల్సి వస్తుంది.
ఈ క్రమంలో అతన్ని పట్టుకోవడానికి రా(RAW) సంస్థ మేజర్ విక్రమ్(ఎన్టీఆర్) ని అలాగే కబీర్ లవర్, సునీల్ లూత్రా కూతురు అయిన కావ్య(కియారా అద్వానీ)ని నియమిస్తుంది. అయితే ఒకానొక అండర్ కవర్ ఆపరేషన్ లో ఓ రాజకీయ నాయకుడి ఫ్యామిలీని కలి సంస్థ చంపాలని చూస్తుంది. ఆ బాధ్యతని కబీర్ కి అప్పగిస్తుంది.
అయితే ఈ ఘోరాన్ని ఆపడానికి విక్రమ్ సాయం కోరతాడు కబీర్. అయితే రక్షణ కల్పించాల్సిన విక్రమ్ ఆ రాజకీయ నాయకుడి కుటుంబాన్ని అంతం చేసి.. కబీర్ ని ఇరికిస్తాడు. విక్రమ్.. కబీర్ ని ఎందుకు టార్గెట్ చేశాడు? విక్రమ్ ఎవరు? కబీర్ వల్ల విక్రమ్ కి జరిగిన అన్యాయం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
స్పై సినిమాలను ఇష్టపడే జనాలు ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే స్పై సినిమాలకి అక్కడ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ‘పఠాన్’ ‘ఏక్ ద టైగర్’ ‘వార్’ వంటి సినిమాలు YRF స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చినవే. ఇందులో ‘పఠాన్’ ‘వార్’ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. YRF అధినేత ఆదిత్య చోప్రాకి బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే ఈసారి YRF స్పై యూనివర్స్ ను సౌత్ లో కూడా ఎక్స్టెన్షన్ చేయాలనే ఆలోచనకి వచ్చి ‘వార్ 2’ లో ఎన్టీఆర్ ని భాగం చేశారు ఆదిత్య చోప్రా. ఎన్టీఆర్ కి కూడా నార్త్ మార్కెట్ పై పట్టు కావాలి. అందుకే ‘వార్ 2’ చేశాడు.
ఎన్టీఆర్ చేసిన పాత్ర.. దానికి పెట్టిన బ్యాక్ స్టోరీ తప్ప.. మిగతా సినిమా అంతా రెగ్యులర్ స్పై సినిమాల్లానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ప్లాట్ లోకి వెళ్లే సరికే చాలా ల్యాగ్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ ఇంటర్వెల్ వద్ద ఎన్టీఆర్ పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్ పై హోప్స్ ఇస్తుంది. అంతే తప్ప ఎక్సయిట్ చేయదు. ఆ ట్విస్ట్ కూడా చాలా మంది గెస్ చేసేలానే ఉంటుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే ఎన్టీఆర్ బ్యాక్ స్టోరీ మినహాయిస్తే.. మిగిలినదంతా రొటీన్ గానే అనిపిస్తుంది.
యాక్షన్ సీక్వెన్స్ లు ఓకే. కానీ తెలుగు ప్రేక్షకులకి అవే కథకి అడ్డుపడుతున్నాయి అనిపిస్తుంది. ఓ దశలో కథ తక్కువ.. యాక్షన్ ఎక్కువ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. పాటలు కూడా ఎక్కవు. విజువల్ గా బాగా పిక్చరైజ్ చేసినా..చూడాలనే ఆసక్తి కలిగించవు. క్లైమాక్స్ కూడా రెగ్యులర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వ ప్రతిభ ఏమీ కనిపించదు. ఎవరు డైరెక్ట్ చేసినా ఇలాగే ఉంటుంది కదా అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ ఎప్పటిలానే తన మార్క్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు అంతే. అతని లుక్స్ కానీ, పెర్ఫార్మన్స్ కానీ.. తెలుగు ప్రేక్షకులకు ‘జై లవ కుశ’ ‘టెంపర్’ స్టైల్లోనే అనిపిస్తాయి. కియారా అద్వానీ నటిగా మెప్పించింది ఏమీ లేదు.యాక్షన్ సీక్వెన్స్ లో కొత్తగా ట్రై చేసింది అనుకోవాలి. కానీ ఎక్కువగా డూప్ షాట్స్ వాడారు అని ఇట్టే పసిగట్టేసేలానే అవి ఉంటాయి. అశుతోష్ రానా, అనిల్ కపూర్..ల పాత్రలు సినిమాకి ఆయువుపట్టుగా నిలుస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
యాక్షన్ ఎపిసోడ్స్
ఎన్టీఆర్
హృతిక్ రోషన్
మైనస్ పాయింట్స్ :
ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం
ప్రెడిక్టబుల్ సీన్స్
మ్యూజిక్
మొత్తంగా.. ఈ ‘వార్ 2’ లో వార్ ఎపిసోడ్స్ తప్ప పెద్దగా ఎక్సయిట్ చేసే ఎలిమెంట్ ఏమీ ఉండదు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోల బాక్సాఫీస్ స్టామినా మాత్రమే ఈ సినిమాని కమర్షియల్ గా గట్టెక్కించాలి. అంతేతప్ప నిర్మాత నాగవంశీ చెప్పిన మెరుపులు ఏమీ ఈ సినిమాలో లేవు.
WAR 2 Telugu Movie Rating : 2.25/5