E-Paper
Advertisement

బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు…అత‌నికి ప్రసిద్ కృష్ణ స‌రైన జోడి

బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు…అత‌నికి ప్రసిద్ కృష్ణ స‌రైన జోడి
Advertisement

Glenn McGrath Called Bumrah A Spring Chicken: టీమిండియా దిగ్గజ బౌలర్ జ‌స్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే వరల్డ్ నెంబర్వన్ బౌలర్ గా ఎదిగాడు బుమ్రా. ఒంటి చేత్తో ఎన్నో విజయాలను టీమిండియా కు అందించాడు. అదిరిపోయే యార్కర్లతో… ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రా అనే పేరు వింటేనే.. ఉలిక్కిపడేలా చేశాడు. అయితే అలాంటి భారత ఆటగాడు, యార్కర్ల కింగ్ బుమ్రా గురించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్లెన్ మెక్ గ్రాత్ (Glenn McGrath) సంచలన వ్యాఖ్యలు చేశారు. యార్కర్ల కింగ్ జ‌స్ప్రీత్ బుమ్రా స్ప్రింగ్ చికెన్ (Spring Chicken) లాంటోడని వెల్లడించారు. అతడికి ప్రసిద్ కృష్ణ సరైన జోడి అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు బౌలర్లు ఎటాక్ చేస్తే… ప్రత్యర్థి జట్టు విలవిలలాడిపోవడం గ్యారంటీ అన్నారు. దీంతో గ్లెన్ మెక్ గ్రాత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

అసలు స్ప్రింగ్ చికెన్ అంటే అర్థమేంటి ?

Advertisement

టీమిండియా జట్టులో కీలకంగా మారిన యార్కర్ల కింగ్, దిగ్గజ బౌలర్ జ‌స్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah)ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతడిని స్ప్రింగ్ చికెన్ అంటూ పిలిచారు. ఇంగ్లీష్ రూఢ్యోక్తి ప్రకారం స్ప్రింగ్ చికెన్ అంటే, వయసున్న యువకుడు అని అర్థం. ప్రస్తుతం యార్కర్ల కింగ్ బుమ్రా వయస్సు 31 నుంచి 32 మధ్యలో ఉంది. అయినప్పటికీ అద్భుతమైన యార్కర్లతో బుమ్రా ఇరగదీస్తున్నాడు. అతని వయస్సు పై బ‌డినప్పటికీ… దుమ్ము లేపుతున్నాడు. ఈ వయసులో కూడా క్రికెట్ అద్భుతంగా ఆడుతున్నాడని… యార్కర్లు వేసి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నట్లు గ్లెన్ మెక్ గ్రాత్ ప్రశంసించాడు. అందుకే బుమ్రాను స్ప్రింగ్ చికెన్ అంటూ నామ క‌ర‌ణం చేశారు.

బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు…అత‌నికి ప్రసిద్ కృష్ణ స‌రైన జోడి

యార్కర్ల కింగ్ బుమ్రా బౌలింగ్ ను మెచ్చుకుంటూ… అతని యాక్షన్ చాలా విభిన్నమైనది అంటూ గ్లెన్ మెక్ గ్రాత్ ప్రశంసలు వర్షం కురిపించారు. బంతిని విసిరే సమయంలో అతని మో చేయి, వెన్నుభాగం సాధారణం కంటే ఎక్కువగా సాగుతాయని వెల్లడించారు. అందువల్ల డిఫరెంట్ గా అతని బంతులు విడుదలవుతాయని పేర్కొన్నారు. ఈ హైపర్ ఎక్స్ టెన్షన్ యాక్షన్ కారణంగా అతని కీళ్లు, వెన్నపూసపై విపరీతమైన ఒత్తిడి పడే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. అందుకే అతడు తరచూ వెన్ను నొప్పితో పాటు మోకాళ్ళ గాయాల బారిన పడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా కెరీర్ సుదీర్ఘకాలం సాగాలంటే, తన శరీరాన్ని కాపాడుకుంటూ ముందుకు అడుగు వేయాలని సూచనలు చేశారు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్లెన్ మెక్ గ్రాత్ (Glenn McGrath).

Advertisement

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

 

 

Related News

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

ధోని కెప్టెన్సీలో ఆడటమే కొంప ముంచింది..ఆ దుర్మార్గుడు నన్ను తొక్కేసాడు!

భారతి ఫుల్మాలికి ఘోర అవమానం…అమ్మాయి కాదు మగాడు అంటూ!

పాకిస్తాన్ ఫైనల్స్ కు వస్తే, టీమిండియా ఓడిపోతుందని… శ్రీలంక గెలిచేలా ఫిక్సింగ్ చేశారు!

ఒరేయ్ ఆలూ అంటూ ట్రోల్స్‌…టీమిండియా అభిమానిపై ఇంజ‌మామ్ దాడి!

Big Stories

Advertisement
×