Saina Nehwal Divorce: ఇండియాలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత బోర్ కొట్టి వదిలేయడం కామన్ అయింది. చిన్న చిన్న సమస్యల కారణంగా.. విడాకులు తీసుకుంటున్నారు సెలబ్రిటీలు. సినిమాలతో మొదలుపెడితే, రాజకీయరంగ ప్రముఖులు అలాగే క్రీడా రంగానికి సంబంధించిన సెలబ్రిటీలు.. ఇలా చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న సమస్యల కారణంగా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు చాలానే వస్తున్నాయి. అయితే తాజాగా మరో క్రీడా జంట విడాకులు తీసుకుంది. భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్ (Saina Nehwal Divorce), అలాగే పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) ఇద్దరూ తాజాగా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు.
ఏడు సంవత్సరాల బంధానికి గుడ్ బై
భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్ అలాగే పారుపల్లి ఇద్దరు.. తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ నిర్ణయాన్ని వెల్లడించింది సైనా నెహ్వాల్. ఆదివారం రోజున అర్ధరాత్రి ఈ పోస్ట్ పెట్టారు సైనా నెహ్వాల్. ఇద్దరం ఆలోచించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు దశాబ్దాల స్నేహానికి అలాగే ఏడు సంవత్సరాల వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సైనా నెహ్వాల్ ఎమోషనల్ పోస్ట్
తన భర్త పారుపల్లి కశ్యప్ కు విడాకులు ఇస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సైనా నెహ్వాల్. లైఫ్ కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలకు తీసుకు వెళుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. అందుకే పారుపల్లి, తాను ఇద్దరం కలిసి సుదీర్ఘంగా ఆలోచించి.. ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. పరస్పర అవగాహనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు. తమ నిర్ణయాన్ని అభిమానులు అందరూ గౌరవించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు సైనా నెహ్వాల్. ఎప్పటిలాగే… అభిమానుల కోసం.. ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అలాగే పారుపల్లి కశ్యప్ ఇద్దరూ కూడా 2018లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఈ ఇద్దరు మంచి స్నేహితులు. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే.. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే 2018లో పెళ్లి జరిగింది. ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు సైనా నెహ్వాల్ దంపతులు. సైనా నెహ్వాల్… రెండుసార్లు కామన్ వెళ్తే చాంపియన్గా నిలబడమే కాకుండా.. 2012 లండన్ ఒలంపిక్స్ లో కాస్య మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఇక సైనా నెహ్వాల్ ప్రకటనతో… అభిమానులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
🚨 India's Badminton Stars Saina Nehwal & Parupalli Kashyap have decided to separate! pic.twitter.com/887oVHIojx
— The Khel India (@TheKhelIndia) July 13, 2025