Salman Butt: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అంతేకాదు టీమిండియా తరఫున అరంగేట్రం కూడా చేయబోతున్నాడు. ఇవాళ ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (Ireland vs India) మధ్య టి20 సిరీస్ జరగనుండగా, తొలి మ్యాచ్ లోనే వైభవ్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని అంటున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు వైభవ్ పనికిరాడని… అతి త్వరలోనే అతడి కెరీర్ క్లోజ్ కావడం గ్యారెంటీ అంటూ బాంబు పేల్చుతున్నారు. లేటెస్ట్ గా వైభవ్ సూర్య వంశీ పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ (Salman Butt) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని బంతులను ఎదుర్కోవడంలో వైభవ్ విఫలమవుతున్నాడని.. అదే కొనసాగితే పృథ్వీ షా ( Prithvi Shaw) తరహాలో అతని కెరీర్ క్లోజ్ కావడం గ్యారంటీ అన్నారు.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్ నేపథ్యంలో ఇవాళ తుదిచెట్టులో వైభవ్ ఆడతాడని చర్చ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ మనోస్థైర్యం దెబ్బతినేలా పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ రేంజ్ కు వెళ్లాలన్న లక్ష్యంతో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. ఈ ప్రయాణం బాగానే ఉంటుంది.. అదే స్థాయిలో ప్రతి మ్యాచ్ లో కూడా రాణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కానీ వైభవ్ సూర్య వంశీ కొన్ని బంతులను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ భట్. దానివల్ల వైభవ్ కెరీర్ దెబ్బతినడం గ్యారంటీ అని హెచ్చరించారు. కొన్ని బౌన్సర్లను ఎదుర్కోవడంలో వైభవ్ వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు.
వాటిపైన వైభవ దృష్టి పెడితే బాగుంటుందని కోరారు. అలా కాదని ఆ బంతులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ఆడతానంటే, కుదరదని వార్నింగ్ ఇచ్చారు. తనకు నచ్చినట్లు వాడితే మాత్రం… పృద్విషా తరహాలో వైభవ్ కెరీర్ 20 ఏళ్లలోపు నాశనం కావడం గ్యారెంటీ అని హితువు పలికారు సల్మాన్ భట్. దీంతో సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు వైభవ్ సూర్యవంశీ వయస్సు విషయంలో కూడా సల్మాన్ భట్ హాట్ కామెంట్స్ చేశారు. అతని వయస్సు విషయంలో కచ్చితంగా ఐసీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని.. ముందుకు వెళ్లాలని కోరారు. అతడు అంతర్జాతీయ క్రికెటర్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, డేట్ అఫ్ బర్త్ పై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఐసీసీ అడుగులు వేస్తే బాగుంటుందని కోరారు.