OPPO Reno 16 Series: ఒప్పో మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Oppo Reno 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నాయి. జులై 2న ఈ సరికొత్త సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈసారి ఈ సిరీస్‌లో భాగంగా Reno 16, Reno 16C అనే రెండు మోడళ్లు రాబోతున్నాయి. వీటితో పాటు సరికొత్త Oppo Bubble Accessory, Enco Air 5 ఇయర్‌బడ్స్‌ను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. అమెజాన్ ఇండియాతో పాటు ప్రముఖ రీటైల్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఫొటోగ్రఫీ ఇష్టపడే వారిని ఈ ఫోన్లు అమితంగా ఆకట్టుకోనున్నాయి. ఈ సిరీస్ ఫోన్లలో వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాతో పాటు, 50MP అల్ట్రావైడ్, 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50MP టెలిఫోటో లెన్స్‌ను అందించారు. ఇక సెల్ఫీల కోసం 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 50MP ఫ్రంట్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చీకటిలోనూ స్పష్టమైన ఫొటోల కోసం డ్యూయల్ ఫ్లాష్ సిస్టమ్, 4K వీడియో రికార్డింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: భారత్‌లో యాపిల్ ప్రొడక్ట్‌ల ధరలు భారీగా పెంపు.. ఏ గ్యాడ్జెట్ ధర ఎంత పెరిగిందంటే?
లుక్ పరంగా ఈ ఫోన్లు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. వెనుక భాగంలో 3D పాప్ ప్లానెట్ డిజైన్‌తో ఇవి మెరిసిపోనున్నాయి. సైజు పరంగా చూస్తే రెనో 16 ఫోన్ 6.32 అంగుళాల డిస్‌ప్లేతో కాంపాక్ట్‌గా ఉంటే, రెనో 16సి మోడల్ కాస్త పెద్దదైన 6.57 అంగుళాల స్క్రీన్‌తో వస్తోంది. ఈ రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఉపయోగించారు. అలాగే ఫోన్ గట్టిదనం కోసం ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, నీటి నుండి రక్షణ కోసం అత్యుత్తమ ఐపీ రేటింగ్‌లను ఇచ్చారు.
ఈ సిరీస్‌తో పాటు వస్తున్న ఒప్పో బబుల్ ఒక సరికొత్త గ్యాడ్జెట్. ఇదొక చిన్న గుండ్రటి డిస్‌ప్లే, ఇది ఫోన్‌కు అయస్కాంతంలా అతుక్కుంటుంది. 1.73 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉన్న ఈ బబుల్‌ను కెమెరా వ్యూఫైండర్‌లాగా, రిమోట్ కంట్రోలర్‌లాగా వాడుకోవచ్చు. ఇందులో ఇంటరాక్టివ్ పెట్స్, కస్టమ్ వాల్‌పేపర్స్ సెట్ చేసుకోవచ్చు. మొత్తానికి డిజైన్, కెమెరా, పర్ఫార్మెన్స్ పరంగా Oppo Reno 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఎంతగానో అలరించనుంది.
Also Read: మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం.. ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో Redmi K90 Ultra వచ్చేస్తోందోచ్!