E-Paper
Advertisement

రిలీజ్ కు ముందే లీకైన అవిన్యా డాష్‌ బోర్డ్.. ఇంటీరియర్‌ చూస్తే వావ్ అనాల్సిందే!

రిలీజ్ కు ముందే లీకైన అవిన్యా డాష్‌ బోర్డ్.. ఇంటీరియర్‌ చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Tata Avinya Dashboard Patent Leaked: టాటా మోటార్స్ నుంచి రాబోతున్నకొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ కారు ‘అవిన్యా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారికంగా మార్కెట్ లోకి విడుదల కాకముందే ఈ కారు ఇంటీరియర్‌ కు సంబంధించిన డిజైన్ పేటెంట్ బయటకు వచ్చింది.

ఇటీవల లీకైన పేటెంట్ ఫోటోలను పరిశీలిస్తే, టాటా అవిన్యాలో పూర్తిగా కొత్త డాష్‌ బోర్డ్ డిజైన్ కనిపించనుంది. ఈ కారులో మధ్య భాగంలో ‘అవిన్యా’ అనే పేరు ఉన్న కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ ను కంపెనీ అందించనుంది. స్టీరింగ్ డిజైన్ చాలా సింపుల్‌ గా, ఆధునికంగా ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది. హెడ్‌ లైట్, వైపర్ కంట్రోల్ స్టాక్‌ లను సాధారణ కార్లతో పోలిస్తే కొంచెం ఎత్తులో అమర్చినట్లు పేటెంట్ ద్వారా తెలుస్తోంది. దీంతో డ్రైవర్‌ కు వాటిని ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

డాష్‌ బోర్డ్ మొత్తం మినిమలిస్టిక్ డిజైన్‌ తో రూపొందించబడింది. ఇందులో రెక్టాంగ్యులర్ ఏసీ వెంట్స్, క్లీన్ లే అవుట్, తక్కువ బటన్లతో లేటెస్ట్ లుక్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ కారులో టాటా ఇప్పటి వరకు ఏ ప్రొడక్షన్ మోడల్‌ లోనూ ఇవ్వని అతిపెద్ద ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. ఇది 14, 15 అంగుళాల టచ్‌ స్క్రీన్ యూనిట్ కావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అవిన్యా టాటా భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లకు ప్రతీకగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఈవీ మాత్రమే కాకుండా, కంపెనీ ప్రీమియం సెగ్మెంట్‌ లో తన స్థాయిని మరింత పెంచే మోడల్‌ గా భావిస్తున్నారు.

2027లో విడుదలయ్యే అవకాశం

అవిన్యా మార్కెట్లోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2027లో ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందే టాటా సియెర్రా ఈవీ, టిగోర్ ఈవీ ఫేస్‌ లిఫ్ట్, సఫారీ ఈవీ లాంటి కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇవే కాకుండా, అవిన్యా తర్వాత మరో కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ ను కూడా టాటా పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ వాహనం కియా కేరెన్స్ క్లావిస్ ఈవీకి పోటీగా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టాటా మోటార్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ 2031 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు కొత్త పెట్రోల్, డీజిల్ మోడళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, విడుదలకు ముందే లీకైన అవిన్యా డాష్‌ బోర్డ్ డిజైన్ ఈ కారుపై ఆసక్తిని మరింత పెంచింది. ఆధునిక టెక్నాలజీ, భారీ టచ్‌ స్క్రీన్, ప్రీమియం ఇంటీరియర్‌ తో ఈ కారు భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

Read Also: సియెర్రా To అవిన్యా.. టాటా రాబోతున్న 5 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

Big Stories

Advertisement
×