IPL 2025 Postponed: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 Tournament ) నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ను వాయిదా వేసింది. ఐపీఎల్ టోర్నమెంట్ ను నిరవధికంగా వాయిదా వేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… ఈ నిర్ణయం తీసుకుంది బిసిసిఐ. నిన్న ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ను రద్దు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి… ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేసింది.
గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో జమ్ము కాశ్మీర్ పై పాకిస్తాన్ దాడులకు వడిగట్టింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ వెంటనే అలర్ట్ అయింది. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పింది ఇండియన్ ఆర్మీ. జమ్ము కాశ్మీర్ పైన పాకిస్తాన్ దేశ డ్రోన్లు పడుతున్న నేపథ్యంలో… వాటిని ఎస్400 తో తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ. అయితే నిన్నటి నుంచి యుద్ధం ప్రారంభమైందని.. తెలుసుకున్న జనాలు అలర్ట్ అయ్యారు. అటు నిన్న రాత్రి యుద్ధం ప్రారంభం అయిన నేపథ్యంలో.. ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కూడా రద్దు చేశారు.
ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రద్దు
సాంకేతిక కారణాలని చెప్పి… మొదట స్టేడియంలో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేశారు అధికారులు. అనంతరం… స్టేడియంలో ఉన్న జనాలు అందరిని బయటకు పంపించారు. అందరూ బయటకు వెళ్లిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ రద్దు అయిందని అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ మ్యాచ్ రద్దయిన తర్వాత… ఖచ్చితంగా ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నిర్వహిస్తామని నిన్న బీసీసీఐ అధికారులు ప్రకటించారు. కానీ ఆ ప్రకటన వచ్చి 24 గంటలు ముగియక ముందే… భారత క్రికెట్ నియంత్రణ మండలి మరో ప్రకటన చేసింది. ఐపీఎల్ టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read: Retirement @ 7:29 PM : ధోని అంటే ఇంత అభిమానమా.. రోహిత్ రిటైర్మెంట్ లోనూ ఫాలో అయిపోయాడు
మళ్లీ ఐపిఎల్ 2025 పునః ప్రారంభం ఎప్పుడు ?
ప్రస్తుతం నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్… మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ ( Test series between England vs Team India ) పూర్తయిన తర్వాత ప్రారంభమయ్యే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జూన్ మాసంలో ప్రారంభమవుతుంది. ఈ ఐదు టెస్టులు పూర్తయిన తర్వాత ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.