Cherlapalli- Srikakulam Special Trains: వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. ముఖ్యంగా రైల్లో ప్రయాణం చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే సమ్మర్ సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి.
చర్లపల్లి- శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు
సమ్మర్ రద్దీకి అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే చర్లపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా తాజాగా చర్లపల్లి- శ్రీకాకుళం నడుమ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12 నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. మొత్తం 26 రైళ్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ రైళ్లలో కొన్ని కొన్ని నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడవనున్నట్లు తెలిపింది. మరికొన్ని రైళ్లు ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది. నల్లగొండ మీదుగా 14 రైళ్లు నడవనుండగా, ఖాజీపేట్ నుంచి 12 రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్త ఎలిపారు.
Read Also: మీ ఆప్తులు జమ్ము కశ్మీర్ లో చిక్కుకున్నారా? ఇవిగో స్పెషల్ ట్రైన్స్!
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తాయంటే?
సమ్మర్ స్పెషల్ రైళ్లు జూన్ 12 నుంచి మొదలై జూన్ 23 వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 12నుంచి జూన్ 23వరకు ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి 07422 నెంబర్ గల రైలు చర్లపల్లికి ప్రయాణిస్తుంది. జూన్ 13 నుంచి జూన్ 25 వరకు ఇదే ప్రత్యేక రైలు (07421) తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయల్దేరి శ్రీకాకుళం చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడతో పాటు ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. శ్రీకాకుళం- చర్లపల్లి, చర్లపల్లి- శ్రీకాకుళం మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు.
Read Also: రైళ్లు నడపడానికి లోకో పైలట్లు దొరకడం లేదట.. టీనేజర్లకు గోల్డెన్ ఛాన్స్!