BigTV English

WPL Auction 2025: జాక్‌పాట్ కొట్టిన 16 ఏళ్ల అమ్మాయి…రికార్డు సృష్టించిన విండీస్ ప్లేయర్!!

WPL Auction 2025: జాక్‌పాట్ కొట్టిన 16 ఏళ్ల అమ్మాయి…రికార్డు సృష్టించిన విండీస్ ప్లేయర్!!

WPL Auction 2025: WPL ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన వేలం కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం పూట ఈ వేలాన్ని నిర్వహించారు. అయితే ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో…మన టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్లకు మంచి ఇద్దరే వచ్చింది. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే… ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో…. టీమిండియా యంగ్ ప్లేయర్ సిమ్రాన్ షేక్ , అలాగే కమలిని ఇద్దరికీ మంచి ధర వచ్చింది.


Also Read: Travis Head: టీమిండియాకు శనిలా మారిన ట్రావిస్ హెడ్…ఆ ఇద్దరి సెంచరీ పూర్తి !

ఇందులో యంగ్ ప్లేయర్ సిమ్రాన్ ను గుజరాత్ జైంట్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఏకంగా 1.9 కోట్లకు సిమ్రాన్ ను కొనుగోలు చేసింది గుజరాత్. అటు కమలిని ని 1.6 కోట్లకు… కొనుగోలు చేసింది ముంబై. అంతేకాదు మహారాష్ట్రకు చెందిన సిమ్రాన్ మంచి బ్యాట్స్మెన్ కాగా…. అటు 16 సంవత్సరాల కమలీని వికెట్ కీపర్. అలాగే కమలీని బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఉన్న ప్లేయర్.


ఇక 23 సంవత్సరాల ప్రేమ్ రావత్… 1.2 కోట్లకు అమ్ముడు పోయింది. రావత్ ను… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. ఈ తరుణంలోనే సిమ్రాన్ అత్యధిక ధర ఈ మెగా వేలంలో పలకడం జరిగింది. ఇక ఆటో వెస్టిండీస్ ప్లేయర్ డియాండ్రా డాట్ ఇన్ 1.7 కోట్లు పలకడం జరిగింది. ఆమెను గుజరాత్ కొనుగోలు చేయడం జరిగింది. ఇక టి20 లో సెంచరీ చేసిన తొలి మహిళా ప్లేయర్ డాట్ ఇన్ కావడం గమనార్హం. అలాగే దక్షిణాఫ్రికా ప్లేయర్ నాడిన్ డి క్లర్క్ ను ముంబై 30 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది.

 

Also Read: Rajat Patidar: ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా యంగ్ ప్లేయర్..?

WPL 2025 వేలం : విక్రయించిన ఆటగాళ్ల పూర్తి జాబితా

సిమ్రాన్ షేక్ – 1.90 కోట్లు – గుజరాత్ జెయింట్స్

డియాండ్రా డాటిన్ – రూ. 1.70 కోట్లు – గుజరాత్ జెయింట్స్

జి కమలిని – రూ. 1.60 కోట్లు – ముంబై ఇండియన్స్

ప్రేమ రావత్ – రూ. 1.2 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఎన్ చరణి – రూ. 55 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్

నాడిన్ డి క్లర్క్ – రూ. 30 లక్షలు – ముంబై ఇండియన్స్

డేనియల్ గిబ్సన్ – రూ. 30 లక్షలు – గుజరాత్ జెయింట్స్

అలానా కింగ్ – రూ. 30 లక్షలు – యుపి వారియర్జ్

అక్షితా మహేశ్వరి – రూ. 20 లక్షలు – ముంబై ఇండియన్స్

నందిని కశ్యప్ – రూ. 10 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్

అరుషి గోస్ – రూ. 10 లక్షలు – యుపి వారియర్జ్

క్రాంతి గౌడ్ – రూ. 10 లక్షలు – యూపీ వారియర్జ్

సంస్కృతి గుప్తా – రూ. 10 లక్షలు – ముంబై ఇండియన్స్

జోషిత VJ – రూ. 10 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

సారా బ్రైస్ – రూ. 10 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్

రాఘవి బిస్త్ – రూ. 10 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జాగ్రవి పవార్ – రూ. 10 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

నికి ప్రసాద్ – రూ. 10 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్

ప్రకాశిక నాయక్ – రూ. 10 లక్షలు – గుజరాత్ జెయింట్స్

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×