Sara Tendulkar : టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గిల్ సారథ్యంలో గుజరాత్ ఈ సీజన్ లో తొలి స్థానంలో కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా ల ప్రేమాయణం పై ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా అంతా కోడై కూస్తోంది. ఈ వార్తలపై అటు గిల్, సారా ఇద్దరిలో ఎవ్వరూ కూడా స్పందించలేదు. తాజాగా సారా టెండూల్కర్ పొట్టి దుస్తులు వేసుకొని ఎక్స్ పోజింగ్ తో ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సారా టెండూల్కర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. శుబ్ మన్ గిల్ సెప్టెంబర్ 18, 1999లో జన్మించగా.. సాారా టెండూల్కర్ అక్టోబర్ 12, 1997లో జన్మించింది. గిల్ కంటే కూడా సారా దాదాపు సంవత్సరం పెద్ద అన్నమాట. అయితే సారా తల్లి అంజలి కూడా సచిన్ టెండూల్కర్ కంటే ఏజీలో పెద్దదే కావడం గమనార్హం. వీరి చదువు విషయానికి వస్తే.. పంజాబ్ మొహలీలోని మానవ్ మంగల్ స్మార్ట్ స్కూల్ లో టెన్త్ పూర్తి చేశాడు గిల్. ఆ తరువాత అండర్ 19 జట్టులో స్థానం సంపాదించాక స్టడీస్ ని పక్కకు పెట్టాడు. సారా తన స్కూల్ లైఫ్ మొత్తం ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పూర్తి చేసింది. పై చదువుల కోసం లండన్ కూడా వెళ్లింది. క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ లో మాస్టర్స్ చేసింది సారా.