Bhuvneshwar Kumar love Story: టీమిండియాలోని అత్యుత్తమ స్వింగ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకరు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల అతడి అసాధారణమైన సామర్థ్యం ద్వారా అతనికి స్వింగ్ కింగ్ అనే మరో పేరును తీసుకువచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ని డకౌట్ చేసిన ఏకైక భారతీయ బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఐపీఎల్ లో రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత. భువనేశ్వర్ కుమార్ 2009 లో ఆర్సిబి తరపున టి-20 అరంగేట్రం చేశాడు.
Also Read: Rahul x Rahul: మీ దుంప తెగ… మహేష్ బాబు సాంగ్ భలే వాడుకున్నారు కదరా
ఆ తరువాత 2011లో పూణే వారియర్స్ తరఫున ఐపీఎల్ డెబ్యూ చేశాడు. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ 2014లో సన్రైజర్స్ హైదరాబాద్ లో చేరాడు. ఇక తర్వాత పది సంవత్సరాలపాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రతినిత్యం వహించాడు. తాజాగా 2025 మెగా వేళానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ భువనేశ్వర్ కుమార్ ని విడిచిపెట్టడంతో ఆర్సిబిలో చేరాడు. భువనేశ్వర్ ని 10.75 కోట్ల భారీ ధరకు ఆర్సిబి కొనుగోలు చేసింది.
ఈ సీజన్ లో భువనేశ్వర్ కుమార్ పరవాలేదనిపిస్తున్నాడు. అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు భువనేశ్వర్ కుమార్. 13 సంవత్సరాల వయసులోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కి చెందినవారు. వీరిద్దరూ చిన్నప్పటినుండే ఒకరికి ఒకరికి తెలుసు. ఆ అమ్మాయి పేరు నుపూర్ నగర్. నుపూర్ తండ్రి మరియు భువనేశ్వర్ కుమార్ తండ్రీ కిరణ్ పాల్ సింగ్ మంచి స్నేహితులు.
ఈ కుటుంబ స్నేహం వీరిద్దరి మధ్య సంబంధానికి పునాది వేసింది. స్నేహం నుండి ప్రేమ వరకు.. కాలం గడిచే కొద్దీ భువనేశ్వర్ కుమార్ అలాగే నుపూర్ మధ్య స్నేహం బలపడింది. భువనేశ్వర్ క్రికెట్ కెరీర్ లో బిజీగా మారినప్పటికీ వీరిద్దరి మధ్య బంధం అలాగే కొనసాగింది. నుపూర్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయినప్పటికీ భువనేశ్వర్ కుమార్ వృత్తిపరమైన జీవితాన్ని అర్థం చేసుకొని ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచింది.
Also Read: RJ Mahvash – Chahal: నువ్వు రా అసలు మగాడివి.. చాహల్ ప్రియురాలు బోల్డ్ కామెంట్స్
వీరిద్దరి మధ్య స్నేహం కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగిన తర్వాత.. 2017 నవంబర్ 23 న మీరట్ లో సాంప్రదాయక హిందూ వివాహ వేడుకతో ఈ జంట ఒకటి అయింది. వీరి వివాహానికి కొంతమంది క్రికెటర్లు కూడా హాజరయ్యారు. 2020లో వీరు ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. ఆమె పేరు అనుష్క. ఇక భువనేశ్వర్ కుమార్ తన కుటుంబంతో గడిపేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. భువనేశ్వర్ కుమార్ క్రికెట్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల హృదయాలను, ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">