ప్రపంచంలో అత్యంత కచ్చితత్వంతో నడిచే రైల్వే వ్యవస్థలో జపాన్ రైల్వే ముందంజలో ఉంటుంది. అత్యాధునిక రైల్వే వ్యవస్థలో జపాన్ టాప్ లో ఉంటుంది. చైనా తర్వాత, అత్యంత వేగంతో ప్రయాణించే రైళ్లు జపాన్ లోనే ఉంటాయి. రోజు రోజుకు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అయితే, రైళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు రైల్వే అధికారులు. అందులో భాగంగానే రన్నింగ్ ట్రైన్లపై రెండు వైపుల నుంచి వాటర్ స్ప్రే చేస్తారు. ఈ విధానం వెనుక ఉన్న లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఎండకాలంలో తీవ్ర ఇబ్బందులు
వేసవి సమయంలో జపాన్ రైల్వే ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ, ఉక్కు ట్రాక్ లు విస్తరించి వంగిపోతాయి. ఇలా జరిగితే రైల్వే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి, జపనీస్ రైల్వే ఆపరేటర్లు ఓ ఆలోచన చేశారు. తక్కువ సాంకేతికతతో మెరుగైన ఫలితాలు పొందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రైలు ట్రాక్ లు చల్లబడటతో పాటు రైలు రైళ్లు కూడా శుభ్రం అయ్యేలా వాటర్ స్ప్రే చేయడం మొదలు పెట్టారు. తీవ్రమైన వేడి సమయంలో జపాన్ రైళ్లకు ఇబ్బందులు కలగకుండా ఈ పద్దతి సాయపడుతుంది.
అధిక ఉష్ణోగ్రతల సమయంలో ట్రాక్ ల విస్తరణ
వాస్తవానికి రైల్వే ట్రాక్ లు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. కానీ, తీవ్రమైన వేడి ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉష్ణోగ్రతలు 30°C (86°F) దాటినప్పుడు, ఉక్కు ట్రాక్ లు విస్తరిస్తాయి. ప్రతి 10°C పెరుగుదలకు, దాదాపు 0.012% విస్తరిస్తుంది. 1 కిలో మీటరు ట్రాక్ విస్తీర్ణంలో కొన్ని సెంటీ మీటర్ల విస్తరణకు దారి తీస్తుంది. వీటని సరిగ్గా మెయింటెనెస్ చేయకపోతే బక్లింగ్ ఏర్పడుతుంది. అంటే పట్టాలు వంకర్లు తిరుగుతాయి. దీనిని సన్ కింక్ అని కూడా పిలుస్తారు. ఇది పట్టాలు తప్పడానికి, పెద్ద పెద్ద మరమ్మతులకు కారణం అవుతుంది. హై-స్పీడ్ షింకన్‌సెన్ రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించే జపాన్‌లో, చిన్న ట్రాక్ వంకర కూడా పెద్ద విపత్కర పరిణామాలను దారితీస్తాయి. దీనిని నివారించడానికి, రైల్వే ఆపరేటర్లు రైలు ఉష్ణోగ్రతలను సురక్షితమైన పరిమితుల్లో ఉంచడానికి వాటర్ స్ప్రే చేస్తారు.
ఇక రైల్వే ట్రాక్ లను చల్లబరచడానికి నీటిని స్ప్రే చేస్తున్నారు. నీరు పట్టాల నుంచి వేడిని గ్రహిస్తుంది. ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. జపాన్ లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. ట్రాక్ సైడ్ స్ప్రింక్లర్ల ద్వారా వాటర్ ను స్ప్రే చేస్తున్నారు. ఈ వ్యవస్థ రైలు ఉష్ణోగ్రతలను 5–10°C వరకు తగ్గిస్తాయి. బక్లింగ్ ను నివారించి, ట్రాక్ సమగ్రతను కాపాడుతుంది. ముఖ్యంగా, షింకన్ సెన్ అధిక వేగంతో వెళ్తున్న నేపథ్యంలో ట్రాక్ భద్రత అనేది చాలా ముఖ్యం. వేడి సమయాల్లో ఆపరేటర్లు సెన్సార్లు, ఇన్ ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగించి రైలు ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తారు. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, వాటిని చల్లబరిచేందుకు వాటర్ స్ప్రే మొదలుపెడతారు.
Read Also: హై-స్పీడ్ రైళ్లలో నూడుల్స్ లొల్లి.. అధికారులు ఏం చెప్పారంటే?