BigTV English

Saudi Argentina: సౌదీ సంచలనం.. అర్జెంటీనాకు షాక్!

Saudi Argentina: సౌదీ సంచలనం.. అర్జెంటీనాకు షాక్!

Saudi Argentina : ఫిఫా వరల్డ్‌కప్‌లో పెను సంచలనం. టోర్నీలో ఫేవరెట్‌గా అభిమానులు చెప్పుకుంటున్న అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాకిచ్చింది. 2-1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై సంచలన విజయం సాధించింది… సౌదీ అరేబియా. ఆట 9వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన మెస్సీ… అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అర్జెంటీనా… ఆ తర్వాత తేలిపోయింది. ఆట 47వ నిమిషంలో సౌదీ ఆటగాడు అల్‌ షెహ్రీ గోల్‌ చేసి… 1-1తో స్కోరు సమం చేశాడు. 57వ నిమిషంలో సౌదీకే చెందిన సలీమ్‌ అల్‌ దవాసరి అద్భుత గోల్‌ కొట్టాడు. పటిష్టమైన అర్జెంటీనా డిఫెన్స్‌ను చేధించుకొని వెళ్లి… టాప్‌ రైట్‌ కార్నర్‌ ఎండ్‌ నుంచి అద్భుతంగా గోల్‌ చేశాడు. దాంతో సౌదీ అరేబియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అర్జెంటీనా పదేపదే సౌదీ గోల్‌ పోస్టుపై దాడి చేసినా… ఫలితం లేకపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి సౌదీ 2-1 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలిచింది. మరో 12 నిమిషాలు అదనపు సమయం కేటాయించినా… అర్జెంటీనా ఓటమిని మాత్రం తప్పించుకోలేకపోయింది. ఆ జట్టు ఓడిపోగానే ప్రత్యక్షంగా, టీవీల్లో మ్యాచ్ చూస్తున్న అర్జెంటీనా ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు.


మరోవైపు… సౌదీ చేతిలో ఓటమితో అర్జెంటీనా అరుదైన రికార్డ్ మిస్‌ చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఓటమి అనేదే ఎరుగదు. 25 మ్యాచ్‌లు గెలిచిన అర్జెంటీనా… 11 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. 2019 కోపా అమెరికా కప్‌ సెమీస్ లో బ్రెజిల్‌ చేతిలో చివరిసారి ఓడిన అర్జెంటీనా… ఆ తర్వాత వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే… అర్జెంటీనా కూడా వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని జట్టుగా ఇటలీ రికార్డును సమం చేసేది. కానీ… సౌదీ చేతిలో ఓడి ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది.


    Related News

    Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

    Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

    Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

    James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

    Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

    Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

    Big Stories

    ×